ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఈ రొట్టెను.. తింటే కలిగే ప్రయోజనాలు ఇవే..!

ప్రస్తుత సమాజంలో చిరుధాన్యాలను( Millet ) ఎక్కువగా ఉపయోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది.తెల్ల రవ్వతో చేసిన టిఫిన్స్ కాకుండా రాగులు, సజ్జలు, జొన్నలతో చేసిన పిండితో బ్రేక్ ఫాస్ట్ తయారు చేసుకుంటూ ఉన్నారు.

 These Are The Benefits Of Eating This Bread In The Morning For Breakfast , Rag-TeluguStop.com

రాగులను మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.రాగి రవ్వతో చేసుకోదగిన రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన వంటకాల్లో రాగి దిబ్బ రొట్టె కూడా ఒకటి అని కచ్చితంగా చెప్పవచ్చు.

రాగి దిబ్బ రొట్టె( Finger millet bread ) చాలా రుచిగా ఉంటుంది.అలాగే మెత్తగా మృదువుగా కూడా ఉంటుంది.

ఈ దిబ్బ రొట్టెను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది.తరచూ ఒకే రకం దిబ్బ రొట్టెలు కాకుండా ఇలా వెరైటీగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Telugu Black Lentils, Carrot, Coriander, Finger Millet, Green, Tips, Rags, Sorgh

రుచితో పాటు ఆరోగ్యాన్ని కోరుకునే వారికి ఇవి చాలా చక్కగా ఉంటాయి.రాగులతో దిబ్బ రొట్టెలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఇలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మినప్పప్పు ఒక గ్లాసు, రాగి రవ్వ మూడు గ్లాసులు, ఉప్పు తగినంత తీసుకోవాలి.ముందుగా మినప్పప్పును శుభ్రంగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టాలి.

తర్వాత ఈ మిన ప్పప్పును జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని గిన్నెలోకి తీసుకోవాలి.తర్వాత రాగి రవ్వను శుభ్రంగా కడిగి నీటిని పిండేసి మిక్సీ పట్టుకొని పిండిలో వేసి బాగా కలపాలి.

తర్వాత దీనిపై మూత పెట్టి రాత్రంతా పులియ పెట్టాలి.పిండి చక్కగా పులిసిన తర్వాత ఇందులో ఉప్పు వేసి బాగా కలపాలి.తర్వాత స్టవ్ మీద మందంగా ఉండే కళాయి ఉంచి నూనె వేయాలి.

Telugu Black Lentils, Carrot, Coriander, Finger Millet, Green, Tips, Rags, Sorgh

తర్వాత పిండి వేసి పైన మరల నూనె వేసుకొని మూత పెట్టాలి.దీనిని చిన్న మంట పై ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఉంచి నెమ్మదిగా కళాయి నుంచి వేరు చేసి పెనం మీద వేసుకోవాలి.తర్వాత మరి కొద్దిగా నూనె వేసి చక్కగా కాల్చుకొని ప్లేట్లో తీసుకోవాలి.

ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాగి దిబ్బ రొట్టె తయారవుతుంది.కావాలంటే మీరు ఉదయం ఆ పిండిలోకి ఉల్లి తురుము, పచ్చి మిర్చి( Green chillies ), క్యారెట్ తురుము, కొత్తిమీర( Coriander ) కూడా కలుపుకోవచ్చు.

దీన్ని చట్నీ, సాంబార్ తో తింటే ఎంతో రుచిగా ఉంటుంది.రాగులను ఎలా ఉపయోగించినా ఆరోగ్యానికి మంచిదే అని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube