టాలీవుడ్ లో తెరకెక్కుతున్న పలు సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి.తెలుగు సినిమాలు కమర్షియల్ గా మంచి విజయం సాధిస్తుండటంతో ఇక్కడి సినిమాలను హిందీ పరిశ్రమలోకి తీసుకెళ్తున్నారు అక్కడి ఫిల్మ్ మేకర్స్.
ఈ రీమేకుల కథ ఇప్పుడే కాదు.గతంలోనూ కొనసాగింది.
పలు తెలుగు సినిమాలు బాలీవుడ్ లోకి వెళ్లాయి.అలనాటి మేటి నటుడు జితేంద్ర సైతం పలు తెలుగు సినిమాల రీమేక్ లో నటించాడు.వాటిలో ఊరికి మొనగాడు సినిమాను హిమ్మత్‌వాలా పేరుతో తెరకెక్కించారు.పెళ్లిచేసి చూడును షాదీ కే బాద్, శారదను దుల్హన్, సోగ్గాడును దిల్‌దార్, స్వర్గం నరకంను స్వర్గ్ నరక్, వేటగాడును నిషానా, ఏడంతస్తుల మేడను ప్యాసా సావన్, అడవి సింహాలును జానీ దోస్త్, దేవతను తోఫా పేరుతో రీమేక్ చేసి మంచి విజయం సాధించాడు.
![Telugu Bollywood, Gudachari, Jaya Lalitha, Jithendra, Karishma Kapoor, Krishna, Telugu Bollywood, Gudachari, Jaya Lalitha, Jithendra, Karishma Kapoor, Krishna,](https://telugustop.com/wp-content/uploads/2021/07/telugu-remak-gudachari-116-krishna-jaya-lalitha-karishma-kapoor.jpg )
అటు 1966లో కృష్ణ హీరోగా గూఢచారి 116 అనే సినిమా వచ్చింది.ఈ సినిమాను జనాలు బాగా ఆదరించారు.ఈ సినిమాతో ఆంధ్రా జేమ్స్ బాండ్‌గా పేరు పొందాడు కృష్ణ.మంగళగిరి మల్లికార్జునరావుఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.కృష్ణ పక్కన జయలలిత హీరోయిన్ గా చేసింది.అటు ఈ సినిమాకు చలపతి రావు సంగీంతం అందించాడు.
ఈ సినిమాలోని ఎర్రాబుగ్గల మీద మనసుంది, నువ్వు నా ముందుంటే నువ్వలా చూస్తుంటే, మనసు తీరా నవ్వులు నవ్వాలి, పడిలేచే కెరటం చూడు అనే పాటలు అప్పట్లోనే బాగా పాపులర్ అయ్యాయి.
![Telugu Bollywood, Gudachari, Jaya Lalitha, Jithendra, Karishma Kapoor, Krishna, Telugu Bollywood, Gudachari, Jaya Lalitha, Jithendra, Karishma Kapoor, Krishna,](https://telugustop.com/wp-content/uploads/2021/07/bollywood-star-hero-jithendra-telugu-remak-gudachari-116-krishna-jaya-lalitha-karishma-kapoor.jpg )
ఈ సినిమా తెలుగులో చక్కటి విజయం సాధించింది.మంచి వసూళ్లు చేపట్టింది.తెలుగులో ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ప్రముఖ నిర్మాత డూండీ ఈ సినిమా హిందీలో రీమేక్ చేయాలి అనుకున్నాడు.
ఈ సినిమాకు హీరోగా జితేంద్ర బాగా సరిపోతాడు అనుకున్నాడు. ఫర్జ్ పేరుతో ఈ సినిమాను రూపొందించేందుకు రెడీ అయ్యాడు.జితేంద్ర నటించిన తొలి తెలుగు రీమేక్ సినిమా ఇదే కావడం విశేషం.ఈ సినిమాకు దర్శకుడిగా పలు సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసి మంచి పేరు సంపాదించుకున్న రవికాంత్ నగాయిచ్ పని చేశాడు.
తెలుగు సినిమాకు ఆరుద్ర అందించిన కథ, స్క్రీన్‌ప్లేను ఉన్నది ఉన్నట్లుగా రీమేక్ సినిమాకు వాడుకున్నాడు రవికాంత్.ఈ సినిమాలో కరిష్మా కపూర్ హీరోయిన్ గా నటించింది.
![Telugu Bollywood, Gudachari, Jaya Lalitha, Jithendra, Karishma Kapoor, Krishna, Telugu Bollywood, Gudachari, Jaya Lalitha, Jithendra, Karishma Kapoor, Krishna,]( https://telugustop.com/wp-content/uploads/2021/07/telugu-remak-gudachari-116-krishna-jaya-lalitha-karishma-kapoor-tollywood.jpg)
అటు తెలుగు సినిమాలో డైలాగ్స్ లేకుండా సినిమాలో కనిపిస్తాడు రాజనాల.హిందీ రీమేక్ లో సైతం ఆయన డైలాగులు లేకుండానే కనిపిస్తాడు.అంతేకాద తెలుగు సినిమా షూటింగ్ జరిగిన ప్రదేశాల్లోనే రీమేక్ ను సైతం తీశారు.మొత్తంగా సినిమా కంప్లీట్ అయి 19678 అక్టోబర్ లో ఈ సినిమా హిందీలో విడుదల అయ్యింది.
ఫర్జ్ సినిమా చక్కటి విజయం సాధించింది.జితేంద్రకు మంచి పేరు తెచ్చింది.