కొందరు చేసే పని వేరే ఉంటుంది.వారి అభిరుచి వేరే ఉంటుంది.
బతకడానికి కొన్ని పనులు చేస్తారు.ఇష్టంతో మరికొన్ని పనులు చేస్తారు.
అలాంటి వారిలో కొంత మంది యంగ్ హీరోయిన్లు కూడా ఉన్నారు.సినిమాలపై మోజుతో చాలా మంది నటీమణులు సినిమా రంగంలోకి అడుగు పెట్టారు.
కానీ తనకు వైద్య సేవ అంటేనే చాలా ఇష్టం అంటున్నారు కొందరు హీరోయిన్లు.తమ తొలి ఛాయిస్ వైద్యమే అంటున్నారు.
ఫ్యాషన్ కోసం సినిమాల్లోకి వచ్చామే తప్ప.అసలు పని ఇది కాదంటున్నారు.
ఇంతకీ ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
డాక్టర్లుగా కొనసాగాలని బలంగా కోరుకుంటున్న హీరోయిన్లు మరెవరో కాదు.
సాయి పల్లవి, రూపా కొడువయూర్.వీరిద్దరి మధ్య పలు పోలికలు ఉన్నాయి.వీరిద్దరూ మంచి డ్యాన్సర్లు కూడా.చక్కటి నాట్యం, మంచి నటన, మేకప్ లేకున్నా ఆకట్టుకునే ముఖం సాయి పల్లవి సొంతం.తమిళనాట పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ సౌత్ లోని తెలుగు, తమిళం, మళయాలం సినిమా పరిశ్రమల్లో చాలా సినిమాలు చేసి టాప్ హీరోయిన్ గా చలామణి అవుతుంది.ఓ వైపు సినిమాల్లో రాణిస్తున్నా.
మెడిసిన్ కొనసాగిస్తూనే ఉంది.జార్జియాలోని తబలలిసి స్టేట్ మెడికల్ వర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసింది.
అంతకు ముందే ప్రేమమ్ సినిమాతో మంచి గుర్తింపు పొందింది ఈ క్యూట్ బ్యూటీ.కొన్ని టీవీ షోల ద్వారా జనాలకు దగ్గరైన ఈ తమిళ భామ ఆ తర్వాత సినిమాలతో మరింత ఆకట్టుకుంది.
అయినా చదువు కొనసాగించింది.కార్డియాలజిస్ట్ కావాలనేదే తన కోరిక అంటుంది ఈ ముద్దుగుమ్మ.
![Telugu Doctors, Surgeon, Mbbs, Sai Pallavi, Tollywood, Top-Telugu Stop Exclusive Telugu Doctors, Surgeon, Mbbs, Sai Pallavi, Tollywood, Top-Telugu Stop Exclusive](https://telugustop.com/wp-content/uploads/2021/07/doctors-turns-tollywood-heroines-sai-pallavi-and-the-roopa-koduvayoor.jpg )
అటు ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో తెలుగు జనాలకు పరిచయం అయ్యింది మరో భామ రూపా కొడువయూర్.తనకు డాక్టర్ కావాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉందని చెప్తుంది ఈ ముద్దుగుమ్మ.ఈమె గుంటూరు కాటూరి మెడికల్ కాలేజీ నుంచి హౌస్ సర్జన్ పూర్తి చేసింది.గత ఏడాది లాక్ డూన్ సమయంలో తన చదువు ఇంకా కొనసాగించింది.అయినా కోవిడ్ బాధితులకు వైద్య సేవలు అందించింది.అంకాలజీలో స్పెషలైజేషన్ కొనసాగిస్తూనే సినిమాలు చేస్తానంటుంది ఈ బ్యూటీ.