ప్రస్తుతం సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2025( Celebrity Cricket League 2025 ) ఉత్కంఠభరితంగా సాగుతోంది.ఈ టోర్నమెంట్‌లో టాలీవుడ్‌ను ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు వారియర్స్ మరోసారి తమ సత్తా చాటారు.
అక్కినేని అఖిల్( Akkineni Akhil ) నేతృత్వంలోని తెలుగు వారియర్స్ నిన్న జరిగిన ఉప్పల్ స్టేడియంలోని మ్యాచ్‌లో భోజ్‌పురి దబాంగ్స్‌పై ఏడు పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసుకుంది.ఈ మ్యాచ్ ప్రారంభం నుంచే ఉత్కంఠభరితంగా సాగింది.
మొదటి బ్యాటింగ్ చేసిన తెలుగు వారియర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 80 పరుగులు చేశారు.అయితే భోజ్‌పురి దబాంగ్స్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 126 పరుగులు చేసి భారీ లీడ్ సాధించింది.
కానీ రెండో ఇన్నింగ్స్‌లో తెలుగు వారియర్స్ అద్భుతంగా రాణించడంతో మ్యాచ్ హోరాహోరీగా మారింది.తెలుగు వారియర్స్ 6 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసి గెలుపును ఖాయంచేశారు.భోజ్‌పురి జట్టు( Bhojpuri team ) రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 79 పరుగులకే ఆలౌట్ అయింది.ఈ మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ ప్లేయర్, టాలీవుడ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్( Music Director SS Thaman ) గ్రౌండ్‌లోనే స్టెప్పులు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.తెలుగు వారియర్స్ 50 పరుగులు పూర్తి చేసిన సందర్భంలో తమన్ తనదైన స్టైల్లో డాన్స్ చేశారు.
బ్యాట్‌ను పైకి లేపి చిన్నపిల్లాడిలా ఉత్సాహంగా స్టెప్పులు వేశారు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కామెంటరీ చేస్తున్న వ్యక్తి కూడా తమన్ డాన్స్ చేస్తున్నాడని మైక్‌లో అనడంతో ఈ సన్నివేశం మరింత హైలైట్ అయింది.
ఈ విజయంతో తెలుగు వారియర్స్ సెమీ ఫైనల్ బెర్త్‌కు మరింత చేరువయ్యారు.ఈ మ్యాచ్ ముందు మ్యాచ్‌లలో ఓడిపోయిన ఈ మ్యాచ్ విజయంతో టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించారు.
మరి టాలీవుడ్ టీమ్ ట్రోఫీ గెలవగలదా? అనేది వేచి చూడాలి.