పెంపుడు కుక్కలు ( pet dogs )సాధారణంగా నమ్మకమైనవిగా, మానవ మిత్రులుగా వ్యవహరిస్తాయి.అయితే, ఒకసారి అవి ఊహించని విధంగా వైల్డ్ మూడ్‌కి వెళ్లినప్పుడు ఎంత ప్రమాదకరంగా మారతాయో తెలియజేసే ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఓ పెట్ క్లినిక్‌లో( pet clinic ) జరిగిన ఈ సంఘటన పశువైద్యుడిని, కుక్క యజమానిని నిజంగానే షాక్‌కు గురి చేసింది.ఒక పశు ఆసుపత్రిలో ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కతో ఉన్న సమయంలో ఇది జరిగింది.
తొలుత కుక్క చాలా శాంతంగా, బాగానే ప్రవర్తించింది.యజమాని దాన్ని ప్రేమగా ముద్దు చేశాడు.
ఆపై చేత్తో నిమిరాడు.కానీ అనూహ్యంగా, అది ఒక్కసారిగా క్రూరమృగంలా మారిపోయింది.

ఆ కుక్క ఒక్కసారిగా రెచ్చిపోయి, తన యజమాని చేతిని గట్టిగా కరుచుకుంది.అతడు ఎంత ప్రయత్నించినా, అది వదలలేదు.కుక్క దాడి చేయడాన్ని పశువైద్యుడు భయంతో చూస్తూ ఉండిపోయాడు.చివరికి బాధితుడు ఆ క్లినిక్ డోర్ తెరిచి, కుక్కను బయటకు నెట్టేశాడు.ఈ సంఘటన క్లినిక్ లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కుక్క ప్రవర్తన అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.నెటిజన్లు ఈ ఘటనపై భిన్నంగా స్పందిస్తున్నారు.
కొందరు “వాళ్ళేమైనా కుక్కను రెచ్చగొట్టి ఉండొచ్చు” అని కొందరు కామెంట్ చేయగా.మరికొందరు “అలాంటి పెంపుడు కుక్కల నోటి వద్ద ఏదైనా సురక్షితంగా ఉంచాల్సింది అని కామెంట్స్ అన్నారు.

ఈ సంఘటన పెంపుడు కుక్క అయినా, వీధి కుక్క అయినా, వాటి ప్రవర్తన ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కుక్కలు సాధారణంగా మానవులకు మంచి మిత్రులే, కానీ కొన్ని సందర్భాల్లో అవి ప్రమాదకరంగా మారవచ్చు.కాబట్టి, ఎవరైనా కుక్కలతో ఉండేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి.మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలు లేమితో కామెంట్ చేయండి.







