మనదేశంలో ఎన్నో మతాలకు చెందిన వారు జీవిస్తున్నారు.అయితే ఏ మతంలో అయినా సరే ఉపవాసం అనేది ఖచ్చితంగా ఉంది.
ఉపవాసం చేస్తే పుణ్యం వస్తుందని, దేవుడి అనుగ్రహం మనపై ఉంటుందని ప్రజలు గట్టిగా నమ్ముతారు.అందుకనే చాలామంది ఉపవాసం కూడా చేస్తూ ఉంటారు.
ప్రజలు వారంలో తమకు ఇష్టమైన రోజు ఉపవాసం చేస్తూ ఉంటాడు.అయితే ఆయుర్వేదం ప్రకారం వారంలో కనీసం ఒక్కరోజు, వీలుకాకపోతే నెలకు కనీసం ఒక్కరోజు అయినా సరే ఉపవాసం చేయాలని చెబుతున్నారు.

అవును నెలకు కనీసం ఒక్కరోజు ఉపవాసం చేసినా మనం అనేక ఆరోగ్య లాభాలను పొందవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.ఉపవాసం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.ఉపవాసం చేయడం వల్ల మన శరీరంలో ఉండే గ్లూకోస్ మొత్తం ఖర్చు అయిపోతుంది.దీంతో శరీరం శక్తి కోసం కొవ్వును ఉపయోగించుకుంటుంది.దీనివల్ల శరీరంలో ఉండే కొవ్వు కరిగిపోతుంది.ఫలితంగా అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు.

అంతేకాకుండా రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి.హార్ట్ ఎటాక్ రాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.కనుక ఉపవాసం తప్పనిసరిగా ఉండడం మంచిది.అంతేకాకుండా ఉపవాసం చేయడం వల్ల షుగర్ రాకుండా ఉంటుందని చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే ఉపవాసం చేయడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.కాబట్టి గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
అంతేకాకుండా లివర్లో ఉండే వ్యర్ధాలు మొత్తం బయటకు వెళ్లిపోతాయి.దీంతో లివర్ పనితీరు మెరుగు పడుతుంది.
ఇంకా చెప్పాలంటే ఉపవాసం చేయడం వల్ల హార్మోన్లు సైతం నియంత్రణలో ఉంటాయి.దీని వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది.
కాస్త తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది.అంతేకాకుండా అధికంగా తినకుండా జాగ్రత్త పడవచ్చు.
దీనివల్ల బరువు కూడా తగ్గుతారు.కాబట్టి ఇన్ని ప్రయోజనాలను అందించే ఉపవాసాలను అసలు మర్చిపోకూడదు.
తప్పనిసరిగా వారంలో ఒకరోజు ఉపవాసం చేయడం మంచిది.వీలైతే కనీసం నెలకు ఒక రోజైనా ఉపవాసం చేయడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.