తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సింగర్ మంగ్లీ( Singer Mangli ) ఒకరు.ప్రస్తుతం ఈమె తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా సినిమా పాటలను పాడే అవకాశాలను అందుకుంటూ బిజీగా ఉన్నారు.
అయితే కొద్ది రోజుల క్రితం రథసప్తమి రోజున అసరవెల్లి సూర్యనారాయణ ఆలయంలో ఈమె తెలుగుదేశం ఎంపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో( Central Minister Ram Mohan Naidu ) కలిసి కనిపించడంతో పెద్ద ఎత్తున ఈమె వివాదంలో నిలిచారు.గతంలో వైసిపికి( YCP ) మద్దతుగా నిలిచిన ఈమె ఇప్పుడు తెలుగుదేశం ఎంపీతో కనిపించడంతో విమర్శలు వస్తున్న నేపథ్యంలో మంగ్లీ స్పందించారు.

ఈ సందర్భంగా ఈమె బహిరంగ లేఖను విడుదల చేశారు.2019 ఎన్నికలకు ముందు కొంతమంది నన్ను సంప్రదించి గాయనిగా మాత్రమే వారు కొన్ని పాటలు పాడమని చెప్పారు తద్వారా నేను జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy ) కోసం పాటలు పాడాను.అంతేకానీ ఎక్కడ కూడా రాజకీయాలు చేయలేదని ఇతర పార్టీ నేతల గురించి మాట్లాడలేదని తెలిపారు.ఇలా వైసిపి కోసం నేను పాట పాడటంతో కొంతమంది నేను ఒకే పార్టీకి చెందిన వ్యక్తిని అంటూ నా పై రాజకీయ( Politics ) రంగు పూశారు.
తద్వారా ఎన్నో అవకాశాలను కూడా నేను కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు.

2019 సంవత్సరంలో కేవలం వైసీపీ పార్టీకి మాత్రమే కాకుండా ఇతర నాయకుల కోసం కూడా నేను పాటలు పాడాలని కాకపోతే గత ఎన్నికలకు ముందు తాను ఎటువంటి పాటలు పాడలేదని తెలిపారు.తన పాట ప్రతీ ఇంట్లో పండగ కావాలి కానీ పార్టీల పాట కాకూడదనేది తన అభిప్రాయం అన్నారు.కళాకారిణిగా తనకు పాటే ముఖ్యమని, కాబట్టి తన పాటకు రాజకీయ రంగులు పులమొద్దని కోరారు.
ఏ రాజకీయ పార్టీతో తనకు సంబంధాలు లేవనీ మంగ్లీ ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.