మొటిమలు బాగా ఇబ్బంది పెడుతున్నాయా.. ఇలా చేస్తే మళ్లీ మీ వంక చూడవు!

మొటిమలు( Pimples ).యుక్త వయసు వచ్చింది చాలు వీటితో సమస్య మొదలవుతుంది.

 Follow This Home Remedy To Avoid Acne , Home Remedy, Latest News, Acne,-TeluguStop.com

మృదువుగా అందంగా ఉన్న చర్మంపై ఒక్క మొటిమ వచ్చినా ముఖం కాంతిహీనంగా మారిపోతుంది.పైగా ఒక్కోసారి మొటిమలు తీవ్ర నొప్పికి గురి చేస్తుంటాయి.

అందుకే మొటిమలు అంటేనే చిరాకు పడుతుంటారు.మిమ్మల్ని కూడా మొటిమలు బాగా ఇబ్బంది పెడుతున్నాయా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ పవర్ ఫుల్ రెమెడీని కనుక ఫాలో అయితే మొటిమలు మళ్లీ మీ వంక కూడా చూడవు.

మరి ఇంకెందుకు ఆలయం ఆ సింపుల్ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Telugu Acne, Tips, Clear Skin, Face Pack, Skin, Remedy, Latest, Pimples, Skin Ca

ముందుగా ఒక చిన్న టమోటాను తీసుకొని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక కలబంద ఆకు నుంచి జెల్ ను సపరేట్ చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు, ( Tomato slices )కలబంద జెల్( Aloe vera gel ) తో పాటు రెండు రెబ్బలు వేపాకు వేసి ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు గోధుమపిండి, వన్ టేబుల్ స్పూన్ తేనె ( Honey )వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకావాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం మొత్తానికి అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై చర్మాన్ని సున్నితంగా రబ్ చేస్తూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

Telugu Acne, Tips, Clear Skin, Face Pack, Skin, Remedy, Latest, Pimples, Skin Ca

రోజుకి ఒక్కసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే ఎలాంటి మొండి మొటిమలు అయినా సరే పరారవుతాయి. మొటిమల తాలూకు మచ్చలు మాయమవుతాయి.అలాగే మళ్లీ మళ్లీ మొటిమలు ద‌రిచేర‌కుండా సైతం ఉంటాయి.

మొటిమలతో బాగా ఇబ్బంది పడే వారికి ఏ రెమెడీ ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.తరచూ ఈ రెమెడీని ఫాలో అయితే మొటిమలకు దూరంగా ఉండవచ్చు.

క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్( Clear and glowing skin ) ను సొంతం చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube