పుదీనా ఆకుల్లో ఫాస్పరస్,క్యాలిష్యం లతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్ బి,సి సమృద్ధిగా ఉంటాయి.అంతేకాక ఒక గ్లాస్ నీటిలో గుప్పెడు పుదీనా ఆకులను వేసి గదిలో ఉంచితే ఆ వాసనకు మనలో ఉన్న ఒత్తిడి దూరం అవుతుంది.
పుదీనాలో ఫైటో న్యూట్రియన్స్,యాంటీ ఆక్సిడెంట్ లు సమృద్ధిగా ఉండుట వలన జీర్ణశక్తిలో సహాయపడుతుంది.
ఒళ్ళు నొప్పులు ఉన్నవారిలో కండరాల నొప్పులను తగ్గించటానికి పుదీనా బాగా సహాయపడుతుంది.
కడుపు ఉబ్బరంతో బాధ పడుతూ ఉంటే…ఒక గ్లాస్ నీటిలో కొన్ని పుదీనా ఆకులను వేసి మరిగించి ఆ నీటిని వడకట్టి భోజనం చేసిన తర్వాత త్రాగితే మంచి ఫలితం కనపడుతుంది.
పుదీనాలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉండుట వలన చిగుళ్ల సమస్యకు ఉపశమనం కలుగుతుంది.
జలుబుతో ముక్కు రంద్రాలు మూసుకుపోయినప్పుడు నీటిలో పుదీనా ఆకులు వేసి మరిగించి ఆవిరి పడితే మూసుకుపోయిన ముక్కు రంద్రాలు తెరుచుకుంటాయి.