నటుడిగా పనికిరాడు అని చెప్పిన రాజశేఖర్ తోనే 5 సినిమాలు చేసిన నిర్మాత ఎవరో తెలుసా?

చాలా మంది నటీనటులు డాక్టర్ కాబోయి.యాక్టర్ అయ్యాము అని చెప్తుంటారు.

 Hero Rajasekhar Rejected By This Producer Pokuri Baburao, Rajasekhar, Rejected B-TeluguStop.com

కానీ రాజశేఖర్ మాత్రం డాక్టర్ అయ్యాకే యాక్టర్ గా మారాడు.ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాతే ఆయన సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు.తెలుగులో ఆయన నటించిన తొలి సినిమా వందేమాతరం.1985లో వచ్చిన ఈ సినిమాకు టి క్రిష్ణ దర్శకత్వం వహించాడు.అంతకు ముందు ఎంవీఎం నిర్మాణ సంస్థ పుదుమై పెణ్ అనే తమిళ సినిమాలో తొలిసారి కనిపించాడు.అందులో రాజశేఖర్ విలన్ పాత్ర పోషించాడు.ఆ సినిమాకు భారతీ రాజా దర్శకత్వం వహించాడు.రాజశేఖర్ ను నటుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి భారతీ రాజా.

ఆ తర్వాత తమిళంలో రాజశేఖర్ నటించిన రెండో సినిమా మన్సూర్.ఈ సినిమా ఎడిటింగ్ లో ఉండగా టి క్రిష్ణ చూశాడు.

అందులో ఆయన నటించిన ఫైట్ సీన్ తనకు బాగా నచ్చింది.ఈ సీన్ చూసి రాజశేఖర్ ను తన వందేమాతరం సినిమాలో హీరోగా సెలెక్ట్ చేసుకున్నాడు.

చిన్నప్పటి నుంచి రాజశేఖర్ కు నత్తి ఉండేది.ఇప్పటితో పోల్చితే సినిమా పరిశ్రమకు వచ్చిన తొలి నాళ్లలో ఆయనకు నత్తి మరీ ఎక్కువగా ఉండేది.అది చూసి టి క్రిష్ణ మిత్రుడైన నిర్మాత పోకూరి బాబురావు.ఇతడు సినిమాకు సెట్ కాడని చెప్పాడు.కానీ క్రిష్ణ అతడి మాటలు పట్టించుకోలేదు.తన నటన అద్భుతంగా ఉంటుందని చెప్పాడు.స్క్రీన్ మీద కూడా బాగా కనిపిస్తాడన్నాడు.నా మాట నమ్మకపోతే సినిమా అయ్యాక చూడాలని మిత్రుడైన నిర్మాతకు చెప్పాడు క్రిష్ణ.

Telugu Eetaram, Vijaya Shanti, Pokuri Baburao, Rajasekhar, Krishna, Tamil Mansoo

మొత్తంగా ఎవరెన్ని మాటలు చెప్పిన రాజశేఖర్ హీరోగా వందేమాతరం సినిమాను తెరకెక్కించాడు క్రిష్ణ.రాజశేఖర్ సరసన విజయశాంతి హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో రాజశేఖర్ నటన జనాలకు విపరీతంగా నచ్చింది.ఆ సినిమా క్రిష్ణ చిత్ర బ్యానర్ పై రూపొందింది.హీరోగా పనికిరాడు అని చెప్పిన రాజశేఖర్ తోనే ఈతర ఫిలిమ్స్ బ్యానర్ పై పోకూరి బాబురావు ఐదు సినిమాలు నిర్మించాడు.వాటిలో రేపటి పౌరులు, ప్రజాస్వామ్యం, నవభారతం, అన్న లాంటి సూసనక హిట్ సినిమాలున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube