సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఇటీవల సనాతన ధర్మటూరు పూర్తిచేసుకుని విజయవాడ చేరుకున్నారు.అయితే శనివారం విజయవాడలో( Vijayawada ) ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహిస్తున్న యుఫోరియా మ్యూజికల్ కన్సర్ట్‌కు ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ కార్యక్రమానికి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నందమూరి బాలకృష్ణ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… బాలకృష్ణ గారు అందరిని తనని బాలకృష్ణ కాకుండా బాలయ్య అంటూ పిలవమని చెబుతూ ఉంటారు.కానీ నాకు మాత్రం బాలయ్య అని అసలు పిలవాలని అనిపించదు.నాకు ఆయన ఎప్పుడూ కూడా సారే అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలతో సభ మొత్తం దద్దరిల్లిపోయింది.బాలకృష్ణ తన నటనతో ఒక తరం వారిని మాత్రమే కాకుండా అన్ని తరాల వారిని కూడా మెప్పిస్తూ ఉన్నారు.

ఇక ఈయన కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి మనసును కూడా చాటుకున్నారు.ఎన్టీఆర్ ట్రస్ట్( NTR Trust ) ద్వారా ఎన్నో గొప్ప సేవా కార్యక్రమాలు చేసినప్పటికీ వాటన్నింటిని బయట చెప్పకుండా వారి పని వారు చేసుకుంటూ వెళ్తున్నారని బాలయ్య గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు.ఇలా బాలయ్య సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆయనకు పద్మభూషన్ అవార్డును( Padma Bhushan Award ) కూడా ప్రకటించింది.బాలకృష్ణ గారు ప్రస్తుతం జస్ట్ బాలయ్య కాదని పద్మభూషణ్ బాలకృష్ణ అంటూ పవన్ తెలిపారు.
ఇక ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు లోకేష్ కూడా రావడంతో గత కొద్దికొద్ది రోజులుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ వస్తున్నటువంటి వార్తలకు పూర్తిగా చెక్ పెట్టినట్లు అయింది.