సినీ నటి సమంత(Samantha) ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు.ఈమె తన వ్యక్తిగత కారణాలు అనారోగ్య సమస్యల కారణంగా గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.
ఇక సమంత చివరిగా వెండితెరపై ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేశారు.ఈ సినిమా తర్వాత సమంత తిరిగి ఏ సినిమాలలో కూడా నటించలేదు అయితే ఈమె కేవలం వెబ్ సిరీస్ లలో మాత్రమే నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇక సమంత వ్యక్తిగత విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఆమె జీవితం ఒక తెరచిన పుస్తకం అని చెప్పాలి.

ఇలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సమంత నటుడు అక్కినేని నాగచైతన్యను(Nagachaitanya) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.కొంత కాలం పాటు వీరి వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా గడిచింది అనంతరం వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో విడాకులు(Divorce) తీసుకొని విడిపోయారు.ఇక నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న సమంత ఒంటరిగా గడుపుతున్నారు.
ఇకపోతే ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఎన్నో విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే సమంత జీవిత భాగ్య స్వామి గురించి చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ప్రతి ఒక్కరూ కూడా మీ ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది.ఆరోగ్యాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు.
శారీరకంగా మానసికంగా మనం ఆరోగ్యంగా ఉండాలి.అలా లేకపోతే మీ భాగస్వామికి నచ్చినట్లుగా మీరు కనిపించలేరు, భాగస్వామి అసంతృప్తి వ్యక్తం చేస్తారు.
ఆనారోగ్యంతో ఎంత అందంగా కనిపించిన, మానసికంగా ప్రశాంతంగా ఉండరు.ఈ విషయాన్ని మీరు గుర్తించలేకపోతే మీ భాగస్వామిని మీరు కోల్పోతారు అంటూ ఈమె చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.