ఐశ్వర్య రాజేష్.( Aishwarya Rajesh ) ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.తెలుగు మూలాలు ఉన్నా సరే తమిళ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకొని అక్కడ కూడా బాగానే పాపులారిటీ సంపాదించుకుంది.
తెలుగులో వరుసగా సినిమాలు చేయాలని ఉన్నప్పటికీ ఆమెకు అనుకున్న రేంజ్ లో అవకాశాలు రాకపోవడంతో తమిళంలోనే సినిమాలలో నటించింది.ఇక తాజాగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం( Sankranthiki Vasthunnam ) సినిమాతో ఒక్కసారిగా తన పేరు మొత్తం మారుమోగిపోయేలా చేసుకుంది.

తన మాటలతో నటనతో ప్రతి ఒక్కరితో శభాష్ అనిపించుకుంది ఐశ్వర్య రాజేష్.హోమ్లీ లుక్ తో తనదైన పాత్రల్లో మెప్పిస్తూ వస్తున్న ఐశ్వర్య సంక్రాంతికి వస్తున్నాం హిట్ తో టాలీవుడ్ లో కూడా సక్సెస్ సాధించింది.ఈ సినిమా తర్వాత ఆమెకు మంచిగా అవకాశాలు వస్తాయని అభిమానులు కూడా భావిస్తున్నారు.చూసిన తర్వాత ఇలాంటి హీరోయిన్లకు కదా అవకాశాలు ఇవ్వాల్సింది అంటూ కూడా కామెంట్స్ చేశారు.
ఇది ఇలా ఉంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ అయిన సందర్భంగా వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఫుల్ బిజీబిజీగా ఉంది ఐశ్వర్య రాజేష్.

ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.నా దృష్టిలో బెస్ట్ పెర్ఫార్మర్ ఎన్టీఆర్.( NTR ) నేను జూనియర్ ఎన్టీఆర్ అభిమానిని.ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ, డ్యాన్సుల్లో స్పెషాలిటీ ఉంటుంది.అందరి ప్రదర్శన ఇష్టమే కానీ ఎన్టీఆర్ నా ఫేవరెట్ అని తెలిపింది ఐశ్వర్య రాజేష్.ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇది ఇలా ఉంటే తాజాగా తారక్ పై ఐశ్వర్య రాజేష్ చేసిన కామెంట్స్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
ఐశ్వర్యఫై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.