ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా (Prabhas , Sandeep Reddy Vanga)కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమాకు సంబంధించి తాజాగా క్యాస్టింగ్ కాల్ విడుదల కాగా ఈ క్యాస్టింగ్ కాల్ గురించి విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ క్యాస్టింగ్ కాల్ కు తాను కూడా అప్లై చేశానని విష్ణు వెల్లడించారు.చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని విష్ణు కామెంట్లు చేయడం గమనార్హం.
ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని విష్ణు (Vishnu)పేర్కొన్నారు.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే.

స్పిరిట్ సినిమా గురించి గతంలో సందీప్ రెడ్డి వంగా కొన్ని కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి.స్పిరిట్ సినిమా తొలిరోజే 150 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించడం ఖాయమని చెప్పుకొచ్చారు.స్పిరిట్ లో ప్రభాస్ (Prabhas)విభిన్నమైన లుక్ లో కనిపిస్తారని సందీప్ రెడ్డి వంగా కామెంట్లు చేశారు.ఈ సినిమాలో ప్రభాస్ ను మరో స్థాయిలో చూశారని ఆయన తెలిపారు.

ప్రభాస్ లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని సందీప్ రెడ్డి వంగా వెల్లడించారు.ప్రభాస్ ను చూపించే విధానం ప్రేక్షకులకు నచ్చితే సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని సందీప్ రెడ్డి వంగా వెల్లడించారు.మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప సినిమా పనులతో బిజీగా ఉన్నారు.ప్రభాస్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తున్నారు.ఏప్రిల్ నెల 25వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.