సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి సాయి పల్లవి ( Sai Pallavi ) ఒకరు.నేచురల్ బ్యూటీగా తన సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటారు.
ఇలా నటనపరంగా సాయి పల్లవి ఎన్నో అవార్డులను పురస్కారాలను కూడా సొంతం చేసుకున్నారు.ఇక ఈమె తాజాగా తండేల్ ( Thandel ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇలా స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా సాయి పల్లవి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.నేను 21 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన అమ్మమ్మ( Grandmother ) తనకోక అద్భుతమైన చీరను( Saree ) కానుకగా ఇచ్చింది.
ఆ చీరను నేను కట్టుకోవాలని ఆమె సూచించింది.పెళ్లి సమయంలో నేను అమ్మమ్మ చీర కట్టుకుందామని భావించాను కానీ అనుకోకుండా సినిమాలలోకి వచ్చానని సాయి పల్లవి తెలిపారు.

ఇకపోతే తనకు అమ్మమ్మ ఇచ్చిన చీరను నేను జాతీయ అవార్డు( National Award ) గెలుచుకున్నప్పుడు తప్పనిసరిగా కట్టుకుంటానని తెలిపారు.జాతీయ అవార్డు అంటే ఆ రోజుల్లో ఎంతో గొప్ప.కాబట్టి, దానిని అందుకున్న రోజు ఈ చీర కట్టుకుని అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నా.కానీ, దానిని అందుకున్నా, అందుకోకపోయినా.ఈ చీర కట్టుకునే వరకు ప్రతిరోజు నాపై ఒత్తిడి ఉంటుందని ఈ సందర్భంగా సాయి పల్లవి తన అమ్మమ్మ చీర గురించి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సాయి పల్లవి ఎంతో అద్భుతమైన నటనను కనబరుస్తుంది.అయితే ఈమెకు ఇదివరకే నేషనల్ అవార్డు వస్తుందని అందరూ భావించారు కానీ మిస్ అయ్యింది.అయితే అమరన్ సినిమాలో( Amaran Movie ) సాయి పల్లవి నటనకు గాను కచ్చితంగా అవార్డు వస్తుందని అందరూ ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు.
మరి సాయి పల్లవి ఎప్పుడు నేషనల్ అవార్డు అందుకుంటుందో తెలియాల్సి ఉంది.