కారాంబోలా అంటే పెద్దగా ఎవరికీ తెలియక పోవచ్చు.కానీ, కారాంబోలా ( Carambola )మరో పేరు అయిన స్టార్ ఫ్రూట్ ను కొత్తగా పరిచయం చేయక్కర్లేదు.
తీపి మరియు పులుపు రుచులను కలగలిసి ఉండే స్టార్ ఫ్రూట్( Star fruit ) ను పెద్దలు, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటుంటారు.స్టార్ ఫ్రూట్ రుచికరమైనదే కాదు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
ముఖ్యంగా హృదయ ఆరోగ్యానికి స్టార్ ఫ్రూట్ ఎంతో మేలు చేస్తుంది.ఈ పండులో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తాయి.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
తక్కువ క్యాలరీలు మరియు అధిక ఫైబర్ ఉన్నందున వెయిట్ లాస్ అవ్వాలని భావిస్తున్నవారికి స్టార్ ఫ్రూట్ మంచి ఆహార ఎంపిక అవుతుంది.
స్టార్ ఫ్రూట్ కడుపును ఎక్కువ సమయం పాటు నిండుగా ఉంచుతుంది.ఆహార కోరికలను నియత్రిస్తుంది.వెయిట్ లాస్‌ను ప్రమోట్ చేస్తుంది.అలాగే స్టార్ ఫ్రూట్ లో విటమిన్ సి, బీటా-కెరోటిన్, ఫ్లేవనాయిడ్లు అధికంగా ఉంటాయి.
ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ ( Free radicals )నుండి రక్షించడంలో సహాయపడతాయి.

స్టార్ ఫ్రూట్ లోని మెండుగా ఉండే విటమిన్ సి ( Vitamin C )రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి రక్షణ కల్పిస్తుంది.స్టార్ ఫ్రూట్ లోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచుతాయి.
స్టార్ ఫ్రూట్‌లో ఫైబర్ అధిక మొత్తంలో ఉండటం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది, మలబద్ధకం సమస్యను దూరం అవుతుంది.

మధుమేహాన్ని నియంత్రించడంలోనూ స్టార్ ఫ్రూట్ సహాయపడుతుంది.స్టార్ ఫ్రూట్ గ్లైసెమిక్ ఇండెక్స్ ( Glycemic index )తక్కువగా ఉండటం వల్ల ఈ పండును తిన్నా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను వేగంగా పెంచదు.పైగా స్టార్ ఫ్రూట్ లో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల అహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో తోడ్పడుతుంది.
కాబట్టి మధుమేహం ఉన్న వారు కూడా స్టార్ ఫ్రూట్ తినొచ్చు.కానీ మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం గుర్తుంచుకోండి.