తప్పు చేస్తే ఆలస్యంగానైనా చేసిన తప్పుకు సంబంధించి శిక్ష అనుభవించాల్సిందేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మస్తాన్ సాయిపై( Mastan Sai ) లావణ్య( Lavanya ) ఫిర్యాదు చేయగా పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
విచారణలో భాగంగా మస్తాన్ సాయి ఆ వీడియోలు తీసింది తానేనని వెల్లడించాడని అన్నీ ఉద్దేశపూర్వకంగా చేశానని చెప్పాడని తెలుస్తోంది.
ఎక్కువ సంఖ్యలో యువతులకు పార్టీ ఏర్పాటు చేసి ఆ పార్టీలో డ్రగ్స్( Drugs ) అలవాటు చేశానని పోలీసులకు విచారణలో భాగంగా మస్తాన్ సాయి వెల్లడించారు.
డ్రగ్స్ మత్తులో ఉన్న అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడి వీడియోలను షూట్ చేశానని మస్తాన్ సాయి చెప్పినట్టు తెలుస్తోంది.ఆ వీడియోల ద్వారా అమ్మాయిలను బ్లాక్ మెయిల్( Blackmail ) చేసి డబ్బులను సంపాదించానని మస్తాన్ సాయి వెల్లడించారు.

బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్ వస్తున్నాయని అయితే వాటిని పార్టీల కోసం మాత్రమే వాడుకున్నానని మస్తాన్ సాయి చెప్పారని తెలుస్తోంది.లావణ్యకు కూడా డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేసినట్టు అంగీకరించిన మస్తాన్ సాయి తాను లావణ్య ఇష్టపూర్వకంగానే చేశానని వెల్లడించినట్టు తెలుస్తోంది.మస్తాన్ సాయి వ్యవహారంలో రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.

మస్తాన్ సాయికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందనే సంగతి తెలిసిందే.మస్తాన్ సాయికి కఠిన శిక్ష విధించాలనే కామెంట్లు సైతం సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి.మస్తాన్ సాయి ఈ కేసు నుంచి బయటపడటం సులువు కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
మస్తాన్ సాయి కెరీర్ ప్రమాదంలో పడినట్టేనని చెప్పవచ్చు.మస్తాన్ సాయి చేసిన తప్పుల విషయంలో నెటిజన్లు సైతం సీరియస్ అవుతున్నారు.
ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం అయితే ఉంది.మస్తాన్ సాయి కేసు విషయంలో లావణ్యను సైతం కొంతమంది విమర్శిస్తున్నారు.