టాలీవుడ్ హీరో బాలకృష్ణ( Balakrishna ) ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు.ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు బాలయ్య బాబు.
ఇప్పటికే తన గత మూడు సినిమాలతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.తాజాగా మరో సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు బాలయ్య బాబు.
ఇలా వరుసగా నాలుగు సినిమాలతో భారీ విజయాన్ని అందుకున్నారు.ఆ సినిమా మరేదో కాదు బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్( Daaku Maharaaj ) సినిమా.
ఈ సినిమా బాలయ్య కెరీర్ లో మరో పెద్ద హిట్గా నిలిచి అదరగొట్టిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం బాలయ్య బాబు ఈ సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తూనే తదుపరి సినిమాలపై దృష్టి పెట్టారు.మరి ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాలయ్య కెరీర్లోనే బిగ్ హిట్ గా నిలిచింది.అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి నెల రోజులు దాటినా కూడా ఓటీటీ లోకి( OTT ) రాకపోవడం ఫ్యాన్స్ కి కూడా ఒకింత ఆశ్చర్యంగా మారిందట.
అయితే ఇపుడు ఫైనల్ గా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న డేట్ వచ్చేసింది.ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో( Netflix ) ఈ ఫిబ్రవరి 21 నుంచి అందుబాటులోకి తెస్తున్నట్టుగా ప్రకటించారు.

సో ఆ రోజుకి అంతా సిద్ధం అయిపోతే సరిపోతుంది.ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్ వారు అలాగే ఈ ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడా ఓటీటీ లో విడుదల అవుతుందా అని అభిమానులు ఎంత గానో ఎదురు చూస్తుండగా ఆ నిరక్షనలకు చెక్ పెడుతూ తాజాగా మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటీంచారు.