ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా అక్రమ వలసదారుల( Illegal Migrants ) గురించే మాట్లాడుకుంటున్నారు.డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయుల తరలింపు కార్యక్రమం చేపట్టారు.
మిలటరీ విమానాల్లో వారిని స్వదేశాలకు తరలిస్తోంది అమెరికా ప్రభుత్వం.ఈ లిస్ట్‌లో భారతీయులు( Indians ) కూడా ఉన్నారు.
ఇప్పటికే 104 మందితో కూడిన విమానం పంజాబ్‌లోని( Punjab ) అమృత్‌సర్‌లో దిగింది.మరో రెండు విమానాలలో 200 మంది వరకు అక్రమ వలస దారులను అమృత్‌సర్‌కు పంపనుంది అమెరికా.
అక్రమ వలసదారుల అంశం భారత్‌లో రాజకీయ రంగు పులుముకుంది.అమెరికా నుంచి వచ్చే విమానాలను దింపేందుకు అమృత్‌సర్‌ను వేదికగా చేర్చుకోవడంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కేంద్రంపై మండిపడగా.
దీనికి బీజేపీ నుంచి అదే స్థాయిలో కౌంటర్లు వస్తున్నాయి.మరోవైపు.అక్రమ వలసదారుల బహిష్కరణ నేపథ్యంలో రాష్ట్రంలో ఇమ్మిగ్రేషన్ సేవలు అందించే సంస్థలు, వ్యక్తులపై పంజాబ్ ప్రభుత్వం గురిపెట్టింది.

దీనిలో భాగంగా అక్రమ మార్గాల్లో ప్రజలను విదేశాలకు పంపుతున్న వారిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది.తాజాగా ప్రమాదకర డంకీ రూట్( Dunki Route ) ద్వారా అమెరికాకు ఓ వ్యక్తిని పంపిన ట్రావెల్ ఏజెంట్‌ను( Travel Agent ) పంజాబ్ పొలీస్ ఎన్ఆర్ఐ వింగ్ అరెస్ట్ చేసింది.నిందితుడిని అనిల్ బాత్రాగా( Anil Batra ) గుర్తించారు.
పాటియాలాలోని( Patiala ) భాడ్సన్‌కు చెందిన గుర్విందర్ సింగ్ ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 8న అనిల్ బాత్రాపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

మోసపూరిత ఇమ్మిగ్రేషన్ పద్ధతుల్లో భారతీయులను విదేశాలకు పంపుతున్న ట్రావెల్ ఏజెంట్ల ఆటకట్టించేందుకు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్.నలుగురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు.దీనికి అదనపు డీజీపీ (ఎన్ఆర్ఐ వ్యవహారాలు) ప్రవీణ్ సిన్హా నేతృత్వం వహిస్తున్నారు.
అమెరికా నుంచి బహిష్కరణకు గురైన వ్యక్తులు.ఏజెంట్లు, సంస్థల గురించిన సమాచారాన్ని సిట్‌కు అందించాలని అధికారులు కోరుతున్నారు.