టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలలో తండేల్( Thandel ) ఒకటి.నాగచైతన్య( Naga Chaitanya ) కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల విషయంలో అదరగొట్టడంతో పాటు ప్రేక్షకులకు సైతం ఎంతగానో నచ్చింది.
తండేల్ సినిమా సక్సెస్ గురించి చందూ మొండేటి( Chandoo Mondeti ) మాట్లాడుతూ తండేల్ సినిమా ప్రత్యేకమైన గౌరవాన్ని ఇస్తుందని బలంగా నమ్మానని ఆ నమ్మకం నిజమైందని తెలిపారు.
నాగచైతన్యతో నాది మూడు సినిమాల ప్రయాణం అని చైతన్యతో అనుబంధం ప్రత్యేకమైనదని ఆయన పేర్కొన్నారు.
చైతన్యతో తెరకెక్కించిన తండేల్ మూవీ 100 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించడం, అంతకు మించిన గౌరవాన్ని తెచ్చిపెట్టడం ఎంతో తృప్తినిచ్చిందని చందూ మొండేటి వెల్లడించారు.ఈ సినిమాలో లవ్ స్టోరీ ఎలా ఉండాలో పాక్ ఎపిసోడ్ ఎలా ఉండాలో ముందునుంచి స్పష్టత ఉందని ఆయన తెలిపారు.

జైలు ఎపిసోడ్ ఇంకా ఉంటే బాగుండేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారని చందూ మొండేటి చెప్పుకొచ్చారు.సినిమాలో ఏది ఎవరికి నచ్చుతుందో ముందే ఊహించానని ఆయన తెలిపారు.కొన్ని సింగిల్ థియేటర్లలో సినిమాను చూసిన సమయంలో ఆ సన్నివేశాలను చాలా ఆస్వాదించడం కనిపించిందని చందూ మొండేటి చెప్పుకొచ్చారు.థియేట్రికల్ అనుభవం కోసం ఎంతో కష్టపడి సినిమా తీశామని ఆయన పేర్కొన్నారు.

మేము కష్టపడి తీసిన సినిమాను కొంతమంది పైరసీ చేశారని పైరసీ( Piracy ) మాట విన్న తర్వాత గుండెలో గునపం గుచ్చినట్లైందని ఆ బాధను మాటల్లో చెప్పలేనని చందూ మొండేటి వెల్లడించారు.సరైన కథ సిద్ధమైతే నాగార్జున గారితో సినిమా చేస్తానని సూర్య కోసం 300 సంవత్సరాల క్రితం జరిగే పీరియాడిక్ కథను సిద్ధం చేశామని చందూ మొండేటి కామెంట్లు చేశారు.చందూ మొండేటి వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.