ఇప్పటి యువతలో కొందరు ప్రేమ అనే పవిత్రమైన భావనను బజారున పడేస్తున్నారు.తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రేమను ఒక సాధనంగా ఉపయోగించుకుంటున్నారు.
కాస్త స్నేహం పెరిగినంత మాత్రాన ప్రేమలో ఉన్నామంటూ నటిస్తూ, స్వార్థ ప్రయోజనాలు నెరవేరిన తర్వాత బ్రేకప్ చెప్పేస్తున్నారు.ఇటీవల, స్కూల్ విద్యార్థుల వయస్సులోనే ప్రేమ పేరుతో యువత( Youth ) అడ్డమైన పనులకు పాల్పడుతోంది.
తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదువుకోవాలని పంపిస్తున్నా.స్కూల్‌కు బదులుగా యువతీ, యువకులు పార్కులు, సినిమా హాళ్లు, రోడ్ల మీద తిరుగుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.
తాజాగా, ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలతో రొమాన్స్( Romance ) చేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఆశ్చర్యకరంగా వీరు స్కూల్ డ్రెస్‌లోనే ఉన్నారు.స్కూల్ బంక్ కొట్టి బయట తిరుగుతున్న ఈ ముగ్గురు రోడ్డుపైనే బహిరంగంగా హద్దులు మీరిన ప్రవర్తన కనబరిచారు.యువకుడు ఒకేసారి ఇద్దరిని లైన్‌లో పెట్టి.వారిని తన కౌగిలిలో బంధిస్తూ ముద్దులు, ఆలింగనాలు చేసుకుంటూ మునిగిపోయాడు.ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇది కాసేపట్లోనే వైరల్( Viral Video ) అయింది.
వారిపై అక్కడే ఉన్న వారు నీళ్లు చల్లడం, చెప్పులతో కొట్టడం వంటి సంఘటనలు కూడా జరిగాయి.ఈ వీడియో చూసిన నెటిజన్లు వారి పై మంది పడుతున్నారు.
చదువుకోవాల్సిన సమయాన్ని ఇలాంటి వాటికి ఉపయోగిస్తున్నారా అంటూ తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.
ఇలాంటి సంఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.ప్రేమ అనేది ఓ గొప్ప భావన.దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
యువత సమయాన్ని, విద్యను విలువైనదిగా గుర్తించాలి.తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా ఈ మార్పును గమనించి, సమయానికి సరైన మార్గదర్శనం ఇవ్వాలి.
అప్పుడే ఈ దారుణ పరిస్థితికి చెక్ పెట్టొచ్చు.