1.ఏ ఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న ఏఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.
2.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2827 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
3.హైదరాబాదులో అభివృద్ధి పనులకు కమిటీ గ్రీన్సిగ్నల్
హైదరాబాద్ నగరంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు స్టాండింగ్ కమిటీ అనుమతులు ఇచ్చింది.
4.16న కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం
ఈ నెల 16న కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు.
5.ఆ హామీని కె.సి.ఆర్ నిలబెట్టుకోవాలి : షర్మిల
యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్న కెసిఆర్ హామీని నిలబెట్టుకోవాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు.
6.కేంద్ర మంత్రిని కలిసిన లక్ష్మణ్
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో తెలంగాణ బిజెపి నేత లక్ష్మణ్ భేటీ అయ్యారు.ఉన్నత విద్యా సంస్థల్లో రిజర్వేషన్ అమలు , ఇతర సమస్యలపై మంత్రి వద్ద ప్రస్తావించారు.
7.తుఫాన్ ఎఫెక్ట్ తో విమానాలు రద్దు
అసాని తుఫాన్ ఎఫెక్ట్ తో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయం నుంచి విశాఖపట్నం విజయవాడ వెళ్లాల్సిన పలు విమానాలు రద్దయ్యాయి.
8.సామాజిక విశ్లేషకుడు నరసింహారావు మృతి
రాజకీయ, సామాజిక విశ్లేషకుడు నరసింహ అనారోగ్యంతో హైదరాబాదులో మృతి చెందారు.
9.నెల్లూరులో బయో ఇథనాల్ ప్లాంట్
నెల్లూరులో 560 కోట్లతో బయో ఇథనాల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఏపీ సీఎం జగన్ తెలిపారు.
10.తెలంగాణ గురుకుల కాలేజీ ల్లో దరఖాస్తులకు ఆహ్వానం
తెలంగాణ గురుకుల ఇంటర్, డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తులకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది.
11.సీ డ్యాక్ లో ఉద్యోగాల భర్తీ
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కు చెందిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ లో ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు.
12.సంజయ్ పై కెటిఆర్ ఆగ్రహం
27 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య కు మంత్రి కేటీఆర్ ఏ కారణం ఈ ప్రజా సంకల్ప యాత్రలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు.బాధ్యతారహితమైన ఆరోపణలు చేయడం సరికాదని ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సంజయ్ కు కేటీఆర్ సవాల్ విసిరారు.
13.57 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల
దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలు 57 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
14.కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి చీఫ్ గా రాజీవ్ కుమార్
కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి చీఫ్ గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు.
15.విదేశాలకు వెళ్లే వారికి బూస్టర్ డోస్ వ్యవది తగ్గింపు
విదేశాలకు వెళ్లేవారికి బూస్టర్ డోస్ వ్యవదిని 9 నెలలు కన్నా ముందే తీసుకోవచ్చని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
16. వైఎస్ కొండా రెడ్డి జిల్లా బహిష్కరణ
జగన్ బంధు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పులివెందుల నియోజకవర్గం చక్రాయ పల్లె ఇంచార్జీ కొండారెడ్డి ఇటీవల అరెస్టు బెయిల్ పై విడుదల అయ్యారు.తాజాగా ఆయనను జిల్లా బహిష్కరణ చేస్తూ జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.
17.నేడు ఏపీ కేబినెట్ సమావేశం
నేడు ఏపీ కొత్త క్యాబినెట్ తొలి సమావేశం సీఎం అధ్యక్షతన జరగనుంది.
18.‘సర్కారు వారి పాట ‘ బాగుంది : విజయ సాయి రెడ్డి
సర్కారు వారి పాట సినిమా బాగుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ ద్వారా తెలియజేశారు.
19.ఆక్వా రంగం పై జగన్ కీలక ఆదేశాలు
ఆక్వా రంగం పై ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.ఆర్ఆర్బీ కేల ద్వారా ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంచేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,200 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,490
.