యాంకర్ గా, నటిగా, రిలేషన్ షిప్ కోచ్ గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సరస్వతీ ప్రదీప్( Saraswathi Pradeep ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ జనరేషన్ కు ఓపిక తగ్గిపోయిందని ఆమె పేర్కొన్నారు.ఈ జనరేషన్ లో ఒకరంటే ఒకరికి విపరీతమైన ఇష్టం ఉందని ఆమె అన్నారు.
ఎంత చేస్తే ఒక లైఫ్ నిలబడుతుందో గుర్తుంచుకోవాలని ఆమె తెలిపారు.మా మామయ్య నన్ను కూతురిలా చూసుకున్నారని ఆమె వెల్లడించారు.కానీ ఇప్పుడు పేరెంట్స్ సర్దుకుని రా అంటున్నారని సరస్వతీ ప్రదీప్ తెలిపారు.విడాకులు( Divorce ) పెరగడానికి కారణం ఆడవాళ్లే అని ఎవరూ ఈ కామెంట్ కు డిఫెండ్ అవ్వొద్దని ఆమె కామెంట్లు చేశారు.
మామూలుగా ఉన్న జంటల్లో సైతం మనమే బీజాలు నాటుతున్నామని సరస్వతీ ప్రదీప్ తెలిపారు.

నేను, ప్రదీప్ గారు హ్యాపీ మ్యారీడ్ లైఫ్( Happy Married Life ) అనే కాన్సెప్ట్ ను డిజైన్ చేసి ఇంటర్నేషనల్ ట్రైనర్స్ గా కొనసాగుతున్నామని ఆమె వెల్లడించారు.కౌన్సిలింగ్ చేయడం ద్వారా సమస్యలను పరిష్కరిస్తామని ఆమె కామెంట్లు చేశారు.నేను నేనుగా స్ట్రాంగ్ గా ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకోవాలని సరస్వతీ ప్రదీప్ అన్నారు.
ఆమె వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

ఈ మధ్య కాలంలో రిలేషన్ షిప్స్ బ్రేక్ అవుతున్న నేపథ్యంలో విడాకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.సరస్వతీ ప్రదీప్ చెప్పిన విషయాలు నిజమేనని నెటిజన్లు సైతం అభిప్రాయపడుతున్నారు.సరస్వతీ ప్రదీప్ జంటలను కలపడానికి చేస్తున్న ప్రయత్నాలను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
భార్యాభర్తల మధ్య గొడవలు జరిగితే వాటిని సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తే మంచిదని చెప్పవచ్చు.