తమ ముఖ చర్మం ఎటువంటి మచ్చలు లేకుండా వైట్ గా బ్రైట్ గా మెరిసిపోతూ కనిపించాలని కోరుకోని వారు ఉండరు.అటువంటి చర్మాన్ని పొందడం కోసం చేయని ప్రయత్నాలు ఉండవు.
స్కిన్ వైట్నింగ్( Skin Whitening ) కోసం ఖరీదైన క్రీములను కూడా వాడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ నైట్ జెల్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ సూపర్ వైట్ గా మారడం ఖాయం.
మరి ఇంతకీ ఆ జెల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది తెలుసుకుందాం పదండి.
ముందుగా అంగుళం పచ్చి పసుపు( Turmeric ) కొమ్ము తీసుకుని పీల్ తొలగించి సన్నగా తురుముకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ లో చిటికెడు కుంకుమ పువ్వు,( Saffron ) పసుపు తురుము, రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్,( Aloevera Gel ) వన్ టేబుల్ స్పూన్ గులాబీ రేకులు వేసి బాగా మిక్స్ చేసి గంట పాటు పక్కన పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టీల్ స్ట్రైనర్ లో ఈ మిశ్రమాన్ని వేసి జెల్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జెల్ లో వన్ టీ స్పూన్ గ్లిజరిన్, వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేస్తే మన నైట్ జెల్ అనేది రెడీ అవుతుంది.ఈ జెల్ ను ఒక బాక్స్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.ప్రతిరోజు నైట్ నిద్రించే ముందు ముఖాన్ని వాటర్ తో వాష్ చేసుకోవాలి.ఆపై తయారు చేసుకున్న జెల్ ను ముఖానికి అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకుని పడుకోవాలి.

రోజు నైట్ ఈ న్యాచురల్ జెల్ ను వాడడం వల్ల స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది.చర్మంపై ఏమైనా మచ్చలు ఉంటే క్రమంగా మాయమవుతాయి.పిగ్మెంటేషన్ సమస్య దూరం అవుతుంది.స్కిన్ ఎటువంటి మచ్చలు లేకుండా సూపర్ వైట్ గా బ్రైట్ గా మెరిసిపోతుంది.అలాగే ఈ జెల్ చర్మానికి చక్కని హైడ్రేషన్ ను అందిస్తోంది.స్కిన్ ను స్మూత్ గా షైనీగా మారుస్తుంది.