కిడ్నీలో రాళ్లు లేదా మూత్ర పిండాల్లో రాళ్లు ఇటీవల కాలంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇది ఒకటి.లవణాలు, యూరిక్ ఆమ్లాలు, కాల్షియం, ఖనిజాలు కలయికతో ఈ రాళ్ళు మూత్రపిండాలలో ఏర్పడుతాయి.
కిడ్నీలో రాళ్లు అనేది సర్వ సాధారణ సమస్య అయినప్పటికీ దీనిని నిర్లక్ష్యం చేస్తే మాత్రం కిడ్నీ డ్యామేజ్ అవ్వడం ప్రారంభం అవుతుంది.
పైగా కిడ్నీలో రాళ్లు ఉండటం వల్ల అనేక సమస్యలను కూడా ఎదుర్కోవాలి.
అందుకే కిడ్నీలో రాళ్లను నివారించుకోవడం చాలా అవసరం.అయితే కిడ్నీలో రాళ్లు ఉన్న వారు కొన్ని కొన్ని ఆహారాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి.
వాటిలో అతి ముఖ్యమైనవి ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది.
టీ తాగనిదే రోజు గడవని వారు ఉంటారు.అయితే కిడ్నీలో రాళ్లు ఉన్న వారు మాత్రం టీ తాగరాదని నిపుణులు చెబుతున్నారు.
టీ తాగడం వల్ల కిడ్నీలో స్టోన్స్ మరింత పెద్దవిగా మారి తీవ్రమైన ఇబ్బందికి గురి చేస్తాయని అంటున్నారు.
అలాగే చాక్లెట్స్ తినే వారు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఉన్నారు.అయితే కిడ్నీలో రాళ్లు ఉంటే మాత్రం చాక్లెట్స్ కు ఖచ్చితంగా దూరంగా ఉండాలి.చాక్లెట్స్ వల్ల కిడ్నీ స్టోన్ సమస్య మరింత తీవ్రంగా మారుతుంది.
బచ్చలి కూరను కూడా కిడ్నీలో రాళ్లు ఉన్న వారు ఎవైడ్ చేయాలి.బచ్చలి కూర తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు మరింత ఎక్కువ అవుతాయి.
ఇక వీటితో పాటుగా రెడ్ మీట్, చేపలు, ఎండుచేపలు, గుడ్లు, పాలు, పాల ఉత్పత్తులు, ఉప్పు, ప్యాక్ చేసిన ఆహారం, నిల్వ పచ్చళ్లు, టమాటాలు, కూల్ డ్రింక్స్, సోడాలు, బీట్‌రూట్, కందగడ్డ, జంక్ ఫుడ్, పొటాటో చిప్స్, ప్యాకేజ్ సాస్, కెచప్, వేరు శెనగలు, చట్నీలు, సాల్ట్ నట్స్, చీజ్ వంటి వాటికి కూడా ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.