శోభన్ బాబు కోసం కథ రాసి ఎన్టీఆర్ దగ్గరికి వెళ్తే దాసరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందో తెలుసా ?

ఇప్పుడంటే సినిమా పరిశ్రమ చాలా సాధారణ స్థాయికి వచ్చింది కానీ ఒకప్పుడు అలా లేదు.చాలా క్రమశిక్షణ నటులు ఉండడం వల్ల అంతే క్రమశిక్షణతో కూడిన దర్శకులు అంతకు మించిన నిర్మాతలు ఉంటూ పరిశ్రమలు నాలుగు కాయలు మూడు పువ్వులుగా వర్ధిల్లేలా చేశారు.

 Who Is The First Choice Of Sardar Paparayudu Movie,sardar Paparayudu Movie,dasar-TeluguStop.com

అందుకే నాటి రోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి నటులు మహానుభావులుగా కీర్తించబడ్డారు.అలాంటి సమయంలో ఎన్టీఆర్ తో సినిమా చేయడం మిగతా హీరోలతో చేసినంత ఈజీగా ఉండేది కాదు అనే టాక్ అప్పటినుంచి ఉండేది.

అందుకు అనేక కారణాలు ఉండేవి.ముఖ్యంగా ఎన్టీఆర్ కు తెలుగుపై మంచి పట్టు ఉండేది, అంతేకాదు స్వతహాగా దర్శకుడు కూడా కావడం తో కథపై ఆయనకు మంచి అవగాహన ఉండేది.అందుకే సాధారణ దర్శకులకు ఎన్టీఆర్ తో సినిమా అంటే చాలా కష్టంగా ఉండేది.అందుకే అన్న గారితో సినిమా చేయాలంటే మంచి దర్శకులు మరియు నిర్మాత ఉండి తీరాల్సిందే.

ఆయనకు కథ చెప్పే ముందే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని అడుగులు వేయాలి.ఇక దాసరి సర్దార్ పాపారాయుడు సినిమా తీసి ఎంతో పెద్ద హిట్ అయ్యిన సంగతి తెలిసిన మనకు తెలిసిందే.

అయితే దాసరి ఆ సినిమా కథ సిద్ధం చేసుకున్న సమయంలో తోలుత ఎన్టీఆర్ ని హీరోగా అనుకోలేదట.శోభన్ బాబుని దృష్టిలో పెట్టుకొని ఈయన ఈ కథ రాసారట.అంతా సిద్ధమైన తర్వాత అంతటి బలమైన కథను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే అంతే బలమున్న ఒక హీరో ఉండాలని భావించి శోభన్ బాబుని కాదని ఎన్టీఆర్ తో చివరి నిమిషంలో సినిమా తీయాల్సి వచ్చిందట.ఈ విషయాన్ని దాసరి ఎన్టీఆర్ తో కూడా చెప్పారట ఇది మీకోసం రాసిన కథ కాదు అలాగే మీకు సంబంధించిన స్క్రిప్టు కాదు కానీ మీరు చేస్తే బాగుంటుందని చివరి నిమిషంలో మీ దగ్గరికి వచ్చామని చెప్పగానే మొదట ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట.

ఎవరి కోసమో రాసుకున్న కథ నాకు చెప్పి చరిత్రను మారుస్తారా లేక చరిత్రను తిప్పేస్తారా అంటూ దాసరి పై విరుచుక పడ్డారట ఎన్టీఆర్.ఆ తర్వాత ఆ దాసరి కథ మొత్తం మార్చాల్సిందే అంటూ ఎన్టీఆర్ పట్టు పడ్డారట.

అయితే దాసరి అందుకు ఒప్పుకోలేదు డైలాగులు మాత్రమే మార్చడానికి దాసరి అంగీకరించారట అలా చేయడం మీకు ఇష్టమైతేనే సినిమా తీద్దామని అనుకొని ఆ తర్వాత డైలాగులు మార్చి సినిమా తీసి హిట్టు కొట్టారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube