ఆస్ట్రేలియాలోని( Australia ) న్యూ సౌత్ వేల్స్‌లో సారా అబూ లెబ్దే( Sarah Abu Lebdeh ) అనే నర్సు చేసిన షాకింగ్ ప్రకటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.తాను ఆసుపత్రిలో పనిచేస్తున్న సమయంలో ఇజ్రాయెల్ దేశస్తులైన రోగులను( Israeli Patients ) చంపానని ఆమె చెప్పడం సంచలనంగా మారింది.
ఈ వ్యవహారంపై న్యూ సౌత్ వేల్స్( New South Wales ) ఆరోగ్య శాఖ వెంటనే స్పందించింది.విచారణకు ఆదేశించింది.
ఆసుపత్రి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.కానీ, ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.
సారా అబూ లెబ్దేను విధుల్లోంచి సస్పెండ్ చేశారు.ఆసుపత్రి అధికారికంగా ఆమె పేరును వెల్లడించకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఆమె ముస్లిం అని జోరుగా ప్రచారం జరుగుతోంది.
హిజాబ్ ధరించే ఆమె వైరల్ వీడియోలో( Viral Video ) కనిపించింది.ప్రముఖ ఇజ్రాయెల్ జర్నలిస్ట్ మాక్స్ వీఫెర్( Max Veifer ) ఇద్దరు నర్సులను ఇంటర్వ్యూ చేశారు.
బ్యాంక్‌స్టౌన్ హాస్పిటల్‌కు చెందిన అహ్మద్ రషద్ నాదిర్, సారా అబూ లెబ్దే ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలోనే సారా బాంబు పేల్చింది.ఇజ్రాయెల్ రోగులను చంపినట్టు చెప్పడంతో వీడియో క్షణాల్లో వైరల్ అయింది.ప్రపంచవ్యాప్తంగా ఈ వీడియో హాట్ టాపిక్‌గా మారింది.
గత ఏడాదిగా ఆస్ట్రేలియాలో యూదు వ్యతిరేక ఘటనలు పెరిగిపోతున్నాయి.యూదుల ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపారాలపై దాడులు జరుగుతున్నాయి.ఒక యూదు పాఠశాల, రెండు ప్రార్థనా మందిరాలను కూడా తగలబెట్టారు.యూదు సంఘం ప్రతినిధి అలెక్స్ రైవ్చిన్ మాట్లాడుతూ, వైద్య నిపుణులు కూడా యూదుల పట్ల శత్రుత్వం చూపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
2023లో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మొదలైనప్పటి నుంచి న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వం సిడ్నీలో ప్రత్యేక పోలీసు టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.యూదులపై జరుగుతున్న ద్వేషపూరిత నేరాలను, ఆన్‌లైన్‌లో విద్వేష ప్రసంగాలు చేసే వారిపై ఈ దళం నిఘా పెట్టింది.ఆరోగ్య మంత్రి ర్యాన్ పార్క్ మాట్లాడుతూ.ఈ విషయాన్ని తాము సీరియస్‌గా తీసుకున్నామని, ద్వేషపూరిత నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.