టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) గురించి మనందరికీ తెలిసిందే.ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రజినీకాంత్.
ఇక ఆయనకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు రజినీకాంత్.
వయసు పెరిగిన ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి.ఇకపోతే రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ సినిమాలలో 1990 లో వచ్చిన అతిశయ పైరవి( Adhisaya Piravi ) అనే సినిమా కూడా ఒకటి.

టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన యముడికి మొగుడు సినిమాను రీమేక్ చేశారు.ఎస్.పి ముత్తు రామన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షీబా ఆకాష్ దీప్( Sheeba Akashdeep ) నటించింది.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె అతిశయ పైరవీ సినిమా షూటింగ్ రోజులను గుర్తు చేసుకుంటూ కొన్ని వ్యాఖ్యలు చేసింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.అతిశయ పైరవి సినిమా షూటింగ్ లో రజనీ గారి క్రేజ్ చూసి నేను షాక్ అయ్యాను.
తెల్లవారు జామున నాలుగున్నర గంటలకే లొకేషన్ కి ఆయన కోసం కొన్ని వేల మంది అభిమానులు భారీ పూల దండలతో వచ్చి భక్తితో ఆయనకి వేసేవారు.

కొంత మంది ఆయన నడిచే దారిలోని మట్టిని సేకరించి దాన్ని పవిత్రంగా భావించే వారు.ఆ సినిమా తర్వాత నేను రజనీ గారిని కలిసింది చాలా తక్కువ.కాకపోతే కొన్ని రోజుల క్రితం ఒక ఫంక్షన్ లో కలిసాను.
ఆయన నన్ను గుర్తుపట్టి నా యోగ క్షేమాలని అడిగి తెలుసుకున్నారు.అతిశయ పైరవి షూటింగ్ అప్పుడు కూడా నాలో ఉన్న భయాన్ని పోగొట్టి, నటనకి సంబంధించిన ఎన్నో సలహాలు ఇచ్చారని చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.