చిన్నప్పుడు ప్రతి ఒక్కరు పెద్ద అయ్యాక ఇలా కావాలి.వీరిలా ఎదగాలి.
లేదంటే ఆయా రంగాల్లో ముందుకు వెళ్లాలి అనుకుంటారు.అలా వెళ్లేందుకు ఎవరినో ఒకరిని ఆదర్శంగా తీసుకుంటారు.
అలా తెలుగు సినిమాలో చాలా మంది హీరోలున్నారు.వారిని యంగ్ హీరోలు, హీరోయిన్లు ఆదర్శంగా తీసుకుని సినిమారంగంలోకి అడుగు పెట్టారు.
ఇంతకీ ఏ నటులు.ఏ నటులను రోల్ మోడల్ గా తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం. ప్రభాస్ తెలుగు టాప్ హీరో ప్రభాస్ తనకు ఇద్దరు రోల్ మోడల్స్ అని చెప్తారు.అందులో ఒకరు తన తండ్రి ఉప్పలపాటి సత్యనారాయణ కాగా మరొకరు తన పెదనాన్న కృష్ణం రాజు. జూనియర్ ఎన్టీఆర్ తన తాత ఎన్టీఆర్ తో పాటు తండ్రి నందమూరి హరి కృష్ణ తనకు రోల్ మోడల్స్ అని జూ.ఎన్టీఆర్ చాలా సార్లు చెప్పారు. రాంచరణ్ తనకు బాబాయ్ పవన్ కల్యాణ్ రోల్ మోడల్ అని మెగాస్టార్ నటవారసుడు రామ్ చరణ్ చెప్పడం విశేషం. మహేష్ బాబు తన తండ్రి కృష్ణతో పాటు తల్లి ఇందిరా దేవి రోల్ మోడల్స్ అని మహేష్ బాబు చాలా సార్లు చెప్పారు.
నాగ చైతన్య
తాత అక్కినేని నాగేశ్వర్ రావుతో పాటు మామ వెంకటేష్ రోల్ మోడలని చెప్పాడు నాగ చైతన్య.రానా తన తాత రామానాయుడు తనకు రోల్ మోడల్ అంటాడు రానా.రవితేజఅమితాబ్ బచ్చన్, చిరంజీవి తన రోల్ మోడల్స్ అని చెప్పాడు మాస్ మహరాజ.సందీప్ కిషన్స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనకు రోల్ మోడల్ అని చెప్పాడు ఈ యంగ్ హీరో.
నాని
తనకు రజనీకాంత్, చిరంజీవి రోల్ మోడల్స్ అని చెప్పారు.పూరీ జగన్నాత్బ్రూస్ లీ, ఆర్జీవీ తన రోల్ మోడల్స్ అంటారు ఈ టాప్ డైరెక్టర్.మెహరీన్అనుష్క శెట్టి తనకు రోల్ మోడల్ అని చెప్పింది మెహరీన్.రితు వర్మమహేష్ బాబు, అనుష్క శెట్టి తనకు రోల్ మోడల్ అని చెప్పింది ఈ చలాకీ భామ.లారెన్స్ప్రభుదేవ, చిరంజీవి తనకు రోల్ మోడల్స్ అని చెప్పాడు ఈ డైరెక్టర్ కం కొరియోగ్రాఫర్.
కీర్తీ సురేష్
తన తల్లి మేనకా సురేష్ తో పాటు జయలలిత రోల్ మోడల్ అని చెప్పింది ఈ ఉత్తమ నటి.శృతి హాసన్తనకు తన తండ్రి కమల్ హాసన్ రోల్ మోడల్ అని చెప్పింది శృతి హాసన్.దేవి శ్రీ ప్రసాద్తన తండ్రి సత్యమూర్తితో పాటు మైఖేల్ జాక్సన్ రోల్ మోడల్స్ అని చెప్పాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్.తమన్తనకు మణిశర్మతో పాటు శంకర్ మహదేవన్ రోల్ మోడల్స్ అని ఎస్ ఎస్ తమన్ చెప్పాడు.
సుభాష్ చంద్రబోస్
ఇళయరాజా తనకు రోల్ మోడల్ అంటాడు ఈ లిరిసిస్ట్. అడవి శేషుతనకు తన తండ్రి అడవి చంద్ర రోల్ మోడల్ అని చెప్పాడు. కైరా అద్వానాతనకు మాధురి దీక్షిత్, శ్రీదేవి రోల్ మోడల్స్ అని కైరా వెల్లడించింది.
.