యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ మెహబూబ్ దిల్‌సే( Mehaboob Dilse ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.రెండు సార్లు బిగ్‌బాస్( Bigg Boss ) రియాలిటీ షోలో పాల్గొన్నప్పటికీ, విజేతగా నిలవలేకపోయిన అతను తన ఆటతీరు, మాటతీరు ద్వారా ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు.
బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రైవేట్ సాంగ్స్ ద్వారా తన అభిమానులను ఆకట్టుకుంటున్నాడు.ఇటీవల మరో బిగ్‌బాస్ ఫేమ్ శ్రీ సత్యతో కలిసి చేసిన ‘నువ్వే కావాలి’ సాంగ్ తో యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్ సాధించింది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మెహబూబ్ తాజాగా తన కుటుంబంలోని ఒక మంచి వార్తను అభిమానులతో పంచుకున్నాడు.తన సోదరుడు సుభాన్ కు మగబిడ్డ( Baby Boy ) పుట్టినట్లు తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు.ఆ బేబీని చేతిలో పెట్టుకుని లాలిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇందుకు సంబంధించి మెహబూబ్ ఎమోషనల్ పోస్ట్ చేస్తూ.“నా సోదరుడు సుభాన్‌కు మగబిడ్డ పుట్టాడు.ఈ బుడ్డోడు మా జీవితాల్లో అంతులేని ఆనందాన్ని తీసుకొచ్చాడు.

అతని రాకతో మా కుటుంబం నవ్వులతో, ప్రేమతో నిండిపోయింది.అతని జీవిత ప్రయాణం ప్రేమ, ఆరోగ్యంతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను.మా కుటుంబ బంధం మరింత దృఢంగా మారాలి.ప్రపంచంలోకి స్వాగతం బుడ్డోడా!” అంటూ రాసుకొని వచ్చాడు.మెహబూబ్ పోస్ట్‌కి మంచి స్పందన వస్తోంది.బుల్లితెర సెలెబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు అతనికి కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు చేస్తున్నారు.
ఇకపోతే, తాజాగా శ్రీ సత్యతో కలిసి చేసిన ‘నువ్వే కావాలి’ సాంగ్ యూరప్ లోని అనేక ప్రదేశాలలో ఒక బిగ్ సెలెబ్రెటీ సినిన్మ పాటకు ఏ మాతరం తీసిపోకుండా పాటను చిత్రీకరించి ఔరా అనిపించారు.ఈ పాటకు దాదాపు రూ.50 లక్షలకు పైననే ఖర్చు అయినట్లు సమాచారం.







