ఇటీవల కాలంలో ఫ్లాప్ సినిమాలు రీ-రిసిలీజ్(re-release) అవుతూ.అద్భుతమైన రెస్పాన్స్‌ను సాధిస్తున్న ఘటనలు చాలానే చూస్తున్నాం.
అప్పట్లో ప్రేక్షకులకు పెద్దగా నచ్చని కొన్ని సినిమాలు, కాలం మారిపోయిన తర్వాత కొత్త ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతున్నాయి.అలాంటి చిత్రాల్లో రామ్ చరణ్ నటించిన ‘ఆరెంజ్’(Orange) ఒకటి.
గత ఏడాది రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను రీ-రిలీజ్ చేయగా, ఊహించని రీతిలో ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.అప్పట్లో ఆరెంజ్ ఫ్లాప్ అవుతుందంటూ విమర్శలు చేసిన వాళ్లే, ఇప్పుడు థియేటర్లలో ఈ సినిమా చూసి సంబరపడిపోతున్నారు.
ఇకపోతే, ఇప్పుడు వాలెంటైన్స్ డే సందర్భంగా మరోసారి ‘ఆరెంజ్’ను రీ-రిలీజ్ (Orange re release)చేశారు.ఆశ్చర్యకరంగా, గతసారి వచ్చిన రెస్పాన్స్‌కి ఏమాత్రం తగ్గకుండా ఈసారి కూడా అదే స్థాయిలో ఆదరణ లభిస్తోంది.
నిజానికి, శుక్రవారం కొత్త సినిమాలు విడుదలైనప్పటికీ ప్రేక్షకులు వాటిని పట్టించుకోవడం లేదు.అందరూ ‘ఆరెంజ్’ సినిమా వైపే మొగ్గు చూపిస్తున్నారు.
అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించిన కొన్ని గంటల్లోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.దీనితో డిమాండ్‌ని గమనించిన బయ్యర్లు, అన్ని ప్రాంతాల్లోనూ షోలు పెంచుతున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ సినిమాను వీకెండ్ వరకూ ప్రదర్శించనున్నారు.
ముఖ్యంగా థియేటర్లలో ‘ఆరెంజ్’ స్పెషల్ షోలు సమయంలో జరిగిన దృశ్యాలు నెట్టింట ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి.సినిమాలోని పాటలు స్క్రీన్ మీద రాగా, థియేటర్ మొత్తమే మ్యూజిక్ ఫెస్టివల్‌లా మారిపోయింది.ప్రేక్షకులు తమ సీట్లలో నిలబడి పాటలు పాడుతూ, స్టెప్పులు వేస్తూ ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తున్నారు.
కొన్ని థియేటర్లలో ప్రేక్షకుల గోల ఎక్కువైపోయిందని మేనేజ్మెంట్ ఆడియోని మ్యూట్ చేయాల్సి వచ్చింది.అయితే స్క్రీన్‌పై రామ్ చరణ్ డ్యాన్స్ వేస్తుండగా, ప్రేక్షకులు కలిసి పాట పాడడం చూసిన ప్రతి ఒక్కరికీ థియేటర్‌లో సినిమా చూసే అనుభవం ఏమిటో చూపించింది.
అయితే, ఈ రీ-రిలీజ్‌కు కలెక్షన్లు కూడా భారీగా వచ్చాయి.కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మొదటి రోజే 50 లక్షలకు పైగా గ్రాస్ వసూలైందంటే నమ్మండి.మొత్తం మీద తొలిరోజే కోటి రూపాయల వసూళ్లు రావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.రెండవసారి రీ-రిసిలీజ్ అయినా ఇంతటి ఆదరణ దక్కడం చాలా అరుదైన విషయమని సినీ పరిశీలకులు చెబుతున్నారు.
ఇప్పటివరకు అనేక ఫ్లాప్ సినిమాలు రీ-రిసిలీజ్ అయ్యి మంచి వసూళ్లు సాధించాయి.కానీ, రెండోసారి కూడా అదే స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందిన సినిమాలు చాలా తక్కువ.
ఇప్పుడు ‘ఆరెంజ్’ అలాంటి అరుదైన సినిమాల్లో ఒకటిగా నిలిచింది.అప్పట్లో ప్రేక్షకులు అర్థం చేసుకోలేకపోయిన కథ, ఇప్పుడు కొత్త జనరేషన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతోంది.
ఈ ఫిల్మ్ ఇప్పుడు కల్ట్ క్లాసిక్‌గా మారిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.