ఎలాంటి మచ్చలు, మొటిమలు లేకుండా చర్మం ఎల్లప్పుడూ మిళమిళ మెరిసిపోవాలని అందరూ కోరుకుంటారు.అందుకోసం చర్మంపై ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటారు.
తరచూ బ్యూటీ పార్లర్స్‌కు వెళ్తారు.ఖరీదైన క్రీములు, లోషన్లు, సీరమ్‌లు వాడుతుంటారు.
వీటివల్ల మన అందం పెరగడం పక్కన పెడితే.ఆ ప్రోడెక్ట్స్ చర్మానికి సరిపడకపోతే రకరకాల సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
అందుకే సహజ పద్ధతుల్లోనే చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించాలి.
అందుకు పాలపొడి అద్భుతంగా సహాయపడుతుంది.
పాలపొడిలో ఉండే కొన్ని ప్రత్యేక పోషకాలు.మొటిమలు, మచ్చలు, మృత కణాలను తొలగించి ముఖాన్ని కాంతివంతంగా మెరిపిస్తాయి.
మరి ఇంతకీ పాలపొడిని చర్మానికి ఎలా వాడాలో చూసేయండి.ముందుగా చిన్న కీర తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి.
ఈ తురుము నుంచి జ్యూస్‌ను మాత్రం సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల పాలపొడి, వన్ టేబుల్ స్పూన్ నిమ్మ తొక్కల పొడి, అర టేబుల్ స్పూన్ బాదం నూనె వేసుకుని కలుపుకోవాలి.
చివరిగా కీర జ్యూస్‌ను కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ముఖాన్ని గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఆపై తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి, కావాలీ అనుకుంటే మెడకు పట్టించి ఇరవై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.

అనంతరం వేళ్లతో స్మూత్‌గా రబ్ చేసుకుంటూ నార్మల్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇలా వారంలో మూడు లేదా నాలుగు సార్లు చేస్తే చర్మం మిళమిళా మెరుస్తుంది.మచ్చలు ఏమైనా ఉంటే క్రమంగా తగ్గిపోతాయి.
స్కిన్ టోన్ పెరుగుతుంది.మరియు చర్మం స్మూత్‌గా తయారు అవుతుంది.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి.తప్పకుండా పైన చెప్పిన రెమెడీని ట్రై చేయండి.