మొద‌టి సంత‌కం ఎవ‌రు చేశారు?.. ఈ విషయాలు తెలిస్తే ఆశ్చ‌ర్యపోతారు!

క్రీస్తు పూర్వం 3000లో మొదట సంతకం చేసే ఆచారం ప్రారంభమైందని చరిత్రలో నమోద‌య్యింది.ఇటువంటి అనేక శాసనాలు, సుమేరియన్ ఈజిప్షియన్ నాగరికతలలో కనిపిస్తాయి, వీటి పిక్టోగ్రాఫ్‌లు లేదా చిత్రాల శ్రేణి అంటారు.

 Know History Of Signature , History Of Signature , Sumerian Egyptian Civilizatio-TeluguStop.com

ఆ సమయంలో ప్రజలు సంతకం చేసేవారు.ఇది పేరు రూపంలోనే కాకుండా, గుర్తింపును నిరూపించడానికి సంతకాలుగా ఫోటోగ్రాఫ్‌లను వినియోగించారు.

అటువంటి అనేక చిత్రాలు సుమేరియన్ మట్టి పలకపై కనుగొన్నారు.దానిపై ఫోటోగ్రాఫ్‌లు సంతకం మాదిరిగా చెక్కివున్నాయి.

ఈ చిత్రాలు చాలా గంభీరమైన అర్థాన్ని కలిగి ఉన్న అక్షరాల సూక్ష్మ‌ రూపం.ఇది అప్పటి నాగరికత గురించి అవగాహనను, గుర్తింపును అందిస్తుంది.

గ్రీకు, రోమన్ నాగరికత కాలంలో కూడా ఇదే కనిపించింది.క్రీ.శ.439లో, వాలెంటినియన్-3 పాలనలో రోమన్లు ​​సంతకం చేశారని చరిత్ర చెబుతోంది.

ఏదేమైనా సంతకం ప్రస్తావన చరిత్రలో 1069 లో మాత్రమే కనిపించింది.ఈ సమయంలో ప్రపంచంలోని ప్రసిద్ధ వ్యక్తుల సంతకాలు చరిత్రలో చేర్చడం ప్రారంభించారు.చట్టబద్ధంగా చెప్పాలంటే 1677లోస్టేట్ ఆఫ్ ఫ్రాడ్ చట్టం ఇంగ్లండ్ పార్లమెంట్‌లో ఆమోదం పొందింది.ఇది సంతకం యొక్క అభ్యాసాన్ని తప్పనిసరి చేసింది.

మోసం లేదా ఫోర్జరీని నిరోధించడానికి ఈ చ‌ర్య చేప‌ట్టారు.ఇది తరువాత సాధారణ పద్ధతిగా మారింది.

కాలక్రమేణా సంతకాల రూపురేఖ‌లు మారాయి.ప్రతిదీ ఎలక్ట్రానిక్‌గా మారుతున్నందున, సంతకం కూడా ఎలక్ట్రానిక్‌గా మారింది.

దీనినే ఇ-సైన్ అంటారు.బ్యాంకులు ఇ-సైన్‌ను మోసం చేయడాన్ని నిరోధించే విధానాన్ని వేగవంతం చేశాయి.

చేతి సంతకాన్ని సులభంగా కాపీ చేయవచ్చు.కానీ ఈ-సైన్‌పై ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదు.

సాంప్రదాయ సంతకం స్థానంలో చిప్,పిన్ సిస్టమ్ వచ్చింది.ఇది ప్రస్తుతం బ్యాంకులలో విరివిగా ఉపయోగిస్తున్నారు.2000లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఈ-సైన్ యాక్ట్‌ను ఆమోదించారు.ఇది ఈ-సిగ్నేచర్ టెక్నాలజీకి మార్గం సుగమం చేసింది.

నేడు ఈ సాంకేతికత ప్రపంచవ్యాప్తంగా అమ‌ల‌వుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube