డార్క్ సర్కిల్స్ లేదా నల్లటి వలయాలు.ముఖ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.
ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, పలు రకాల మందుల వాడకం, ధూమపానం, మద్యపానం, హార్మోన్ చేంజ్ తదితర కారణాల వల్ల కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి.వాటిని వదిలించుకోవడం కోసం మార్కెట్లో లభ్యమయ్యే ఉత్పత్తులపై ఆధారపడుతుంటారు.
కానీ ఇంట్లోనే ఇప్పుడు చెప్పబోయే విధంగా సీరంను తయారు చేసుకుని వాడితే డార్క్ సర్కిల్స్ ఇట్టే మాయమవుతాయి.పైగా ఈ సీరం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సీరంను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి.
ముందుగా ఒక చిన్న బంగాళదుంపను తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
అలాగే ఒక చిన్న కీర దోసకాయను కూడా తీసుకుని తొక్క చెక్కేసి స్లైసెస్ మాదిరి కట్ చేయాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న కీర దోసకాయ స్లైసెస్, బంగాళదుంప ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జ్యూస్ లో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి ఆగకుండా కనీసం ఐదు నిమిషాల పాటు మిక్స్ చేయాలి.అంతే మన సీరం సిద్ధమవుతుంది.ఈ సీరంను ఒక బాటిల్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.
ఉదయం స్నానం చేయడానికి గంట ముందు మరియు నిద్రించే ముందు తయారు చేసుకున్న సీరంను కళ్ళ చుట్టూ అప్లై చేసి స్మూత్ గా ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

ప్రతిరోజు ఈ సీరంను వాడితే డార్క్ సర్కిల్స్ చాలా త్వరగా తగ్గుముఖం పడతాయి.మరియు ఈ సీరం ను వాడటం వల్ల కళ్ళ వద్ద ముడతలు ఉన్న మాయమై చర్మం టైట్ గా మారుతుంది.కాబట్టి ఎవరైతే డార్క్ సర్కిల్స్ తో తీవ్రంగా మదన పడుతున్నారో వారు తప్పకుండా పైన చెప్పిన విధంగా ఇంట్లోనే సీరంను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.