తెలియక ఈ పొరపాట్లు చేస్తున్నారా..? అయితే చాలా డేంజర్..!

ఈ మధ్యకాలంలో చాలామంది ఆరోగ్యాన్ని శ్రద్ధగా చూసుకుంటున్నప్పటికీ కూడా మరణాలు తప్పడం లేదు.

చాలామంది వ్యాయామం( Exercise ) చేస్తూ బలంగా, దృఢంగా ఉన్నప్పటికీ గుండెపోటు లాంటి కారణాలతో మరణం చెందుతున్నారు.

దీనికి ప్రధాన కారణం ఒత్తిడి దీని కారణంగా వ్యాయామం చేస్తూ శరీరాన్ని ఆరోగ్యంగా కాపాడుకుంటున్నప్పటికీ కూడా రిస్క్ లో పడుతున్నారు.అయితే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం సరైన జీవనశైలి అవసరం.

అంతే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కూడా వ్యాయామం ద్వారా కాపాడుకోవడం చాలా అవసరం.అయితే దీన్ని సరిగ్గా సురక్షితంగా అమలు చేయడం మరీ ముఖ్యం.

వ్యాయామం చేస్తున్నప్పుడు కొన్ని సాధారణ వ్యాయామ తప్పులు నిజానికి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి.ఆరోగ్యకరమైన ఆలోచనలతో వ్యాయామాలను చేస్తున్నవారు తప్పక ఈ లోపాలను అర్థం చేసుకొని వాటిని నివారించడం చాలా ముఖ్యం.

Advertisement

అయితే ఈ వ్యాయామ పొరపాట్ల వలన గుండెపోటు ప్రమాదం( Heart Attack ) పెరుగుతాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మామూలుగా మనం చేసే పెద్ద తప్పులలో వైద్య చరిత్రను మర్చిపోవడం ఒక తప్పు.గుండె జబ్బులు, ఇతర హృదయ సంబంధ సమస్యలు ఉంటే వ్యాయామాలు చేసే ముందు ఆరోగ్య నిపుణులను సంప్రదించడం చాలా అవసరం.

అలా కాకుండా సొంత నిర్ణయం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా గుండెపై అనవసరమైన ఒత్తిడి పడుతుంది.

దీంతో ప్రమాదానికి దారి తీస్తుంది.అలాగే శరీరానికి ఎక్కువగా ఒత్తిడి, శ్రమకు లోను చేయడం వలన అది హృదయానికి హానికరంగా మారుతుంది.ఓవర్ ట్రైనింగ్( Over Training ) గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఎందుకంటే శరీరానికి తగిన విశ్రాంతి కావాలి.అలా కాకుండా క్రమంగా వ్యాయామ ప్రణాళికలు అనుసరించడం వలన చాలా ప్రమాదం వస్తుంది.

Advertisement

శరీరం వేడెక్కడం, చల్లబరచడం గురించి నిర్లక్ష్యం చేయడం కూడా తప్పు.

అలాగే సరైన వ్యాయామం గుండె కండరాలను వేగం కోసం సిద్ధం చేస్తాయి.అలాగే రక్తపోటును క్రమంగా సాధారణ స్థితికి రావడానికి సహాయపడుతుంది.అలాంటి సమయంలో గుండెపై అదనపు ఒత్తిడి ఉంటుంది.

అది చాలా ప్రమాదం.డిహైడ్రేషన్ ( Dehydration ) గుండెపై అదనపు ఒత్తిడి కలిగిస్తుంది.

వ్యాయామం చేసేటప్పుడు శరీరం చెమట ద్వారా ద్రవాలను కోల్పోతుంది.అందుకే వాటిని తిరిగి నింపకపోతే రక్తం చిక్కగా మారిపోయి గుండెను పంప్ చేయడం కష్టతరం చేస్తుంది.

దీంతో గుండెకు చాలా ప్రమాదం ఉంటుంది.

తాజా వార్తలు