సినిమాల్లో నటించాక ఒక గుర్తింపు అనేది వస్తుంది.పేరు, ప్రఖ్యాతలతో పాటు ఐశ్వర్యం, డబ్బు కూడా సొంతం అవుతుంది.
కానీ వచ్చిన ఆ పేరుని, డబ్బుని పదిలంగా దాచుకోవడం అనేది చాలా ముఖ్యం.అలాగే సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన చాలామంది హీరో హీరోయిన్స్ పేరుతో పాటు డబ్బులు కూడా సంపాదించారు.
కానీ కొంతమంది మాత్రమే అప్పులు పాలు అవ్వకుండా ఉన్నారు.మరికొంతమంది అయితే ఉన్నది అంతా పోగొట్టుకుని అప్పులు పాలు అయ్యారు.
సరైన గైడెన్స్ లేక అప్పులు పాలు అయిన వాళ్లలో హీరోయిన్ రోజా కూడా ఒకరనే చెప్పాలి.ఇంకా రోజా విషయానికి వస్తే.
రోజా రెడ్డి 1972 లో చిత్తూరు జిల్లాలోని బకరరావుపేట లో జన్మించింది .ఆమె అసలు పేరు శ్రీలతా రెడ్డి. ఆమె తల్లి తండ్రులు నాగరాజారెడ్డి, లలిత.ఆమెకి ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు .ఒకరు కుమారస్వామి రెడ్డి, మరొకరు రామప్రసాద్ రెడ్డి.తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీలో డిగ్రీ వరకు చదివింది.
చదువుకుంటున్న రోజుల్లోనే సినిమాల్లో అవకాశం రావడంతో శోభన్ బాబు నటించిన సర్పయాగం సినిమాలో ఆయనకు కూతురుగా నటించింది.తరువాత హీరోయిన్ గా రాజేంద్ర ప్రసాద్ పక్కన ప్రేమ యాగం సినిమాలో నటించింది.
అక్కడ నుండి మొదలయిన రోజా ప్రయాణం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి వందకు పైగా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.అందరి అగ్ర హీరోల సరసన నటించింది రోజా.

అయితే రోజాను తమిళంలో అగ్ర దర్శకుడు అయిన సెల్వమణి తమిళ ఇండస్ట్రీకి పరిచయం చేసాడు.ప్రశాంత్ తో పాటు చామంతి సినిమాలో నటించింది.అలాగే శరత్ కుమార్ తో సూర్యం సినిమాలో కూడా నటించింది.ఈ రెండు సినిమాలో తమిళంలో సూపర్ హిట్ అయ్యాయి.ఆ రెండు సినిమాలతో తమిళంలో రోజా సూపర్ స్టార్ అయిపొయింది.ఇలా సినిమాల్లో నటిస్తున్న క్రమంలోనే దర్శకుడు సెల్వమణి తో ప్రేమలో పడింది.
వీళ్ళ ప్రేమాయణం చాలా ఏళ్ళ పాటు కొనసాగింది.ఇవివి సత్యనారాయణ సీతారత్నం గారి అబ్బాయి సినిమా షూటింగ్‌లో ఉన్నపుడు సెల్వమణి తన ప్రేమ విషయం రోజాకు చెప్పడం, ఆమె ఒప్పుకోవడం రెండు జరిగిపోయాయి.
అయితే వీరివురు చాలా ఏళ్ళ పాటు ఎదురుచూసి పెద్దల అంగీకారం తో పెళ్లి చేసుకున్నారు.
సెల్వమణి తమిళంలో పేరు ఉన్న దర్శకుడు కావడంతో తమిళంలో చాలా సినిమాలు చేసింది.
పెళ్లి అయిన తరువాత సినిమా అవకాశాలు తగ్గడంతో ప్రొడక్షన్ కంపెనీ ని ఏర్పాటు చేసి సినిమాల నిర్మాణం చేపట్టింది.భర్త సెల్వమణి ని దర్శకుడిగా పెట్టి అనేక సినిమాలను నిర్మించినది రోజా.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజను సినిమాలను సైతం తాను హీరోయిన్ గా సంపాదించిన డబ్బు అంతటిని పెట్టుబడిగా పెట్టి సినిమాలను నిర్మించినది.అయితే సెల్వమణి ఆరంభంలో తీసిన రెండు మూడు సినిమాలు మంచి హిట్ అయ్యాయి కానీ తరువాత తీసిన సినిమాల వలన తీవ్రమైన ఎదురుదెబ్బలు తగిలాయి.
తీసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆర్థికంగా ఉన్నదంతా ఊడ్చేసుకుని పోయింది.హీరోయిన్ ఛాన్సులు లేక, డబ్బులు లేక ఏమి చేయాలో తెలియని పరిస్థితులలో ఉండిపోయింది రోజా.
అంతేకాకుండా అప్పట్లో రోజాను నమ్ముకొని ఆమె అన్న వదిన పిల్లలు కూడా ఒకే కుటుంబంగా జీవిస్తున్నారు.అందరిని పోషించే భారం రోజా మీద పడింది.

ఇక ఆ సమయంలో ఏదోటి చేయాలనీ నిర్ణయం తీసుకుని టీడీపీ పార్టీలో చేరి తెలుగు మహిళ అధ్యక్షురాలుగా చేరింది.రోజాకి మంచి వాక్ చాతుర్యంతో పాటు, పొలిటికల్ సైన్స్ చదవడంతో రాజకీయాల్లో నిలదొక్కుకున్నది.అలాగే తన నోటికి వచ్చినట్లు మాట్లాడం, చిన్న పెద్ద అని చూడకుండా తనకి నచ్చినట్లు మాట్లాడడం ఆమె నైజం.అందుకే రోజా ఫైర్ బ్రాండ్ అని పేరు తెచ్చుకుంది.
టీడీపీ పార్టీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే గా పోటీ చేసి ఓడిపోయింది.ఒకపక్క సినిమాల పరంగా మరోపక్క రాజకీయంగా కూడా నష్టపోయింది.
ఇలా సినిమాల్లో ఎంతో కాలం పాటు కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది.తరువాత 2014 లో వైసీపీ తరుపున పోటీ చేసి నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గా గెలిచింది.
తరువాత ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ రియాలిటీ షో లో జడ్జిగా చేయడం ప్రారంభించింది.ఇలా తన అప్పుల నుండి కొంత ఉపశమనం పొందడానికి వచ్చిన ప్రతి సినిమా అవకాశాన్ని చేస్తూ వచ్చింది.
ఇలా రోజా ఎమ్మెల్యే గా మారిన తరువాత తన అప్పులు అన్నీ తీర్చేసి తన ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతుంది.అంతే రోజాని ఒక విధంగా చెప్పాలంటే జబర్దస్త్, వైసీపీ పార్టీ ఆదుకుందనే చెప్పాలి.!!
.