ఐటి అధికారులు( IT Officers ) ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నిర్మాతల ఇళ్లపై దాడికి దిగారు.నేడు ఉదయం ఎనిమిది బృందాలుగా ఐటి అధికారులు దిల్ రాజు( Dil Raju ) ఇల్లు ఆఫీసు పై దాడి చేశారు.
అదేవిధంగా ఆయన నిర్మాణ భాగస్వాములు అలాగే తన కుమార్తె ఇంటిలో కూడా ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ నివాసాల్లో సోదాలు చేస్తున్నారు.
ఏకకాలంలో అనేకచోట్ల సోదాలు చేస్తున్న 65 బృందాలు, ఎనిమిది ప్లేసుల్లో సోదాలు చేస్తున్నారు.
సంక్రాంతికి దిల్‌రాజు( Dil Raju ) ప్రొడక్షన్స్ నుంచి రెండు భారీ సినిమాలు విడుదల అయ్యాయి.
రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో పాటు, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు నిర్మాతక వ్యవహరించారు.అలాగే డాకు మహారాజ్ డిస్ట్రిబ్యూటర్ గా కూడా దిల్ రాజు వ్యవహరించారు .దీంతో ఒక్కసారిగా ఐటి అధికారులు ఈయన ఇల్లు ఆఫీసులపై దాడి చేసినట్టు తెలుస్తుంది.
ఇక కేవలం దిల్ రాజు ఇంటిపై మాత్రమే కాకుండా మైత్రి మూవీ మేకర్స్( Mytri Movie Makers ) సంస్థ మీద కూడా ఐటి దాడులు( IT Raids ) జరుగుతున్నాయి.మైత్రీ నవీన్, సిఇఒ చెర్రీ, ఇంకా సంస్థ సంబంధీకుల అందరి ఇళ్లల్లో ఒకేసారి సోదాలు జరుపుతున్నారు.ఇటీవల ఈ సంస్థ నుంచి పుష్ప 2( Pushpa 2 ) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది ఏకంగా 1800 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్టు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా పుష్ప రీ లోడ్ వర్షన్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.నిర్మాణ సంస్థలో మరిన్ని సినిమాల్లో కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.దీంతో ఐటి అధికారులు మైత్రి సంస్థ పై కూడా దాడి చేశారు.ఇక వీటితోపాటు మ్యాంగో మీడియా( Mango Media ) సమస్థ పై కూడా దాడులు చేసినట్టు తెలుస్తోంది.
సింగర్ సునీత భర్తకు సంబందించిన ఆఫీసులు, ఇళ్ల పై కూడా సోదాలు చేస్తున్నారు అధికారులు.