అఖండ 2 లో బాలయ్య సెంటిమెంట్ హీరోయిన్.... బ్లాక్ బస్టర్ కావడం పక్కా?

నందమూరి నట సింహం బాలకృష్ణ ( Balakrishna )  ఇటీవల వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నారు… ఇక సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బాలకృష్ణ డాకు మహారాజ్ ( Daaku Maharaaj ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

 Actress Sobhana Play Key Role On Akhanda 2 Movie Details, Akhanda 2, Balakrishna-TeluguStop.com

ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తిరిగి బోయపాటి ( Boyapati ) దర్శకత్వంలో నటించబోతున్నారు.ఇదివరకే వీరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖండ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

Telugu Akhanda, Balakrishna, Boyapati Sreenu, Narinari, Senior Shobana, Shobana

ఇక ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా ఆఖండ 2 ( Akhanda 2 ) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది.ఈ సినిమాలో బాలకృష్ణ సెంటిమెంట్ హీరోయిన్ నటించబోతున్నారంటూ ఓ వార్త వైరల్ అవుతుంది.ఈ సినిమాలో పెద్ద ఎత్తున స్టార్ సెలబ్రిటీలు నటించబోతున్నారని సమాచారం.ఈ క్రమంలోనే బాలయ్యకు హిట్ సెంటిమెంట్ అయినటువంటి సీనియర్ హీరోయిన్ శోభన ( Shobana ) నటించబోతున్నారని తెలుస్తోంది.

Telugu Akhanda, Balakrishna, Boyapati Sreenu, Narinari, Senior Shobana, Shobana

బాలకృష్ణ శోభన హీరో హీరోయిన్లుగా నారీ నారీ నడుమ మురారి( Nari Nari Naduma Murari ) అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.ఇక ఈ హీరోయిన్ తిరిగి ఆఖండ 2 సినిమాలో ఓ సన్యాసి పాత్రలో కనిపించబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇదే కనుక నిజమైతే మరోసారి బాలయ్య బ్లాక్ బస్టర్ సినిమాని తన ఖాతాలో వేసుకోబోతున్నారు అంటూ అభిమానులు భావిస్తున్నారు.

ఒకప్పుడు హీరోయిన్గా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా మారినా శోభన చాలా రోజుల తర్వాత తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాలో నటించిన శోభన ఇప్పుడు బాలయ్య సినిమాలో కూడా కనిపించబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube