శరీరంలోని ప్రతి అవయవం సక్రమంగా పని చేయాలంటే రక్తం శుద్ధిగా ఉండటం ఎంతో అవసరం.లేదంటే రక్తంలోని మలినాల వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
శరీరంలోని అవయవాలు చురుకుగా పని చేయడం తగ్గిపోతుంది.అలాగే రోగ నిరోధక శక్తి సన్నగిల్లడం, చర్మ సమస్యలు, అలసట, తలనొప్పి వంటి ఎన్నో సమస్యలు ఇబ్బంది పెడతాయి.
అందుకే రక్తాన్ని శుద్ధి చేసుకోవాలి.అయితే రక్తాన్ని శుద్ధి చేసుకునేందుకు కొందరు మార్కెట్‌లో దొరికే బ్లడ్ ప్యూరిఫికేషన్ సిరప్లు వాడతారు.
కానీ, ఇప్పుడు చెప్పబోయే ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకుంటే న్యాచురల్‌గానే రక్తాన్ని శుద్ధి చేసుకోవచ్చు.మరి ఆ ఆహారాలు ఏంటో చూసేయండి.మలినాలను, విషపదార్థాలను బయటకు పంపి రక్తాన్ని శుద్ధి చేయడంలో బీట్ రూట్ అద్భుతంగా సహాయపడుతుంది.వారంలో మూడు, నాలుగు సార్లు బీట్ రూట్ జ్యూస్ సేవించడం వల్ల.
రక్తం శుద్ధి అవుతుంది.మరియు రక్త హీనత సమస్య కూడా దూరం అవుతుంది.
అలాగే క్యాబేజీలో కూడా రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు ఉన్నాయి.వారంలో ఒకటి రెండు సార్లు క్యాబేజీ జ్యూస్ తీసుకోవడం వల్ల రక్తంలో పేరుకుపోయిన మలినాలు నాశనం అవుతాయి.అంతేకాదు, క్యాబేజీ జ్యూస్ తీసుకుంటే వెయిట్ లాస్ కూడా అవుతారు.
అల్లం రసంలో కొద్ది తేనె కలిపి తీసుకోవాలి.ఇలా చేయడం వల్ల శరీరంలో ఎన్నో రకాల విషతుల్యాలు బయటకు పోయి రక్తం శుద్ధిగా మారుతుంది.పైగా అల్లం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.
కొన్ని రకాల పండ్లు కూడా రక్తాన్ని శుద్ధి చేస్తాయి.అలాంటి వాటిలో గ్రేప్స్, క్రాన్ బెర్రీస్, బ్లూ బెర్రీస్, అవకాడో, యాపిల్ వంటి పండ్లు ఉన్నాయి.కాబట్టి, మీ డైట్‌లో ఈ పండ్లు ఉండేలా చూసుకోండి.
ఇక వాటర్ ఎక్కువగా తీసుకోవాలి.ప్రతి రోజు ఏదో ఒక రూపంలో పసుపు తీసుకోవాలి.బెల్లానికి కూడా రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది.
అందువల్ల, ప్రతి రోజు చిన్న బెల్లం ముక్కను తీసుకోండి.రోజూ వ్యాయామం చేయండి.
వ్యాయామం వల్ల రక్తంలోని మలినాలు చెమట రూపంలో బయటకు వెళ్తాయి.రక్త శుద్ధి జరుగుతుంది.