ఎండ దెబ్బకు ముఖం నల్లగా మారిందా.. 20 నిమిషాల్లో రిపేర్ చేసుకోండిలా!

వర్షాకాలం( rainy season ) అన్న మాటే కానీ గత వారం రోజుల నుంచి కొన్ని ప్రాంతాల్లో ఎండలు కుమ్మేస్తున్నాయి.ఎండ, ఉక్కపోత కారణంగా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

 Repair Sun-tanned Skin With This Home Remedy! Sun-tanned Skin, Skin Care, Skin W-TeluguStop.com

ఇకపోతే ఎండ దెబ్బకు ఒక్కోసారి ముఖం నల్లగా మారిపోతుంటుంది.అలాంటి సమయంలో చర్మాన్ని మళ్లీ మునుపటిలా ఎలా మెరిపించుకోవాలో తెలియక తెగ వర్రీ అయిపోతూ ఉంటారు.

కానీ ఇకపై మీకు ఆ టెన్షన్ అక్కర్లేదు.ఎండ వల్ల నల్లగా మారిన చర్మాన్ని 20 నిమిషాల్లో రిపేర్ చేసుకోవచ్చు.

Telugu Tips, Skin, Latest, Repairsun, Skin Care, Skin Care Tips, Skin Detan, Ski

అందుకు ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు అన్నం వండిన తర్వాత వచ్చే గంజిని వేసుకోవాలి.ఈ అన్నం గంజిలో మన చర్మ ఆరోగ్యానికి తోడ్పడే పోషకాలు ఎన్నో ఉంటాయి.అలాగే వన్ టేబుల్ స్పూన్ గడ్డ పెరుగు( curd ), పావు టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు( Organic turmeric ), వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ ( Lemon juice )వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

చివరిగా రెండు టేబుల్ స్పూన్లు పెసర పిండిని కూడా వేసి మరోసారి కలుపుకోవాలి.

Telugu Tips, Skin, Latest, Repairsun, Skin Care, Skin Care Tips, Skin Detan, Ski

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై తడి క్లాత్ సహాయంతో ప్యాక్ ను తొలగించి వాటర్ తో శుభ్రంగా స్కిన్ ను క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ హోమ్ రెమెడీ మీ చర్మాన్ని డీ-టాన్ చేస్తుంది.

ఎండ దెబ్బకు నల్లగా మారిన చర్మాన్ని మళ్లీ వైట్ గా మరియు బ్రైట్ గా మారుస్తుంది.చర్మానికి కొత్త మెరుపును అందిస్తుంది.చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది.స్కిన్ ను డీప్ గా క్లీన్ చేస్తుంది.

అంతేకాదు ఈ రెమెడీని తరచూ పాటించడం వల్ల మొటిమల బెడద తగ్గుతుంది.చర్మం ఆరోగ్యంగా అందంగా మెరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube