బాలయ్య బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన డాకు మహారాజ్( Daaku Maharaaj ) మూవీ తాజాగా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో వైష్ణవి పాత్రలో హైదరాబాద్ లో స్థిరపడిన కుటుంబానికి చెందిన వేద అగర్వాల్( Veda Agarwal ) నటించి తన అద్భుతమైన అభినయంతో మెప్పించారు.
డాకు మహారాజ్ సినిమా సక్సెస్ వల్ల వేద అగర్వాల్ కు సైతం మూవీ ఆఫర్లు అంతకంతకూ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.
థమన్ బీజీఎం, డైరెక్టర్ బాబీ ఇచ్చిన ఎలివేషన్స్ అదిరిపోయాయి.
బేబీ వైష్ణవి చిన్న వయస్సులోనే సింగర్ గా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.ఈ చిన్నారి ప్రముఖ సింగర్లలో ఒకరైన మాధవ్ అగర్వాల్ కూతురు కావడం గమనార్హం.
వేద అగర్వాల్ డాకు మహారాజ్ తో భారీ సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో ఈమె తండ్రి ఎంతగానో సంతోషిస్తున్నారని తెలుస్తోంది.
హైదరాబాద్ నగరంలో బిగ్ స్క్రీన్ పై కూతురిని చూస్తుంటే సంతోషానికి అవధులు లేకుండా పోయాయని ఆయన వెల్లడించారు.నా కల నెరవేరిందని అనిపిస్తోందని చెప్పుకొచ్చారు.గతంలో ఈ చిన్నారి గాండీవధారి అర్జున( Gaandeevadhari Arjuna ) సినిమాలో నటించారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం వేద అగర్వాల్ కు ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వస్తున్నాయని ఒక క్రేజీ ప్రాజెక్ట్ కు ఈ చిన్నారి ఓకే చెప్పారని భోగట్టా.
డాకు మహారాజ్ మూవీ రెండో రోజు బుకింగ్స్ సైతం అదుర్స్ అనేలా ఉన్నాయి.గంటకు 14000 టికెట్ల చొప్పున ఈ సినిమాకు బుకింగ్స్ జరుగుతుండటం గమనార్హం.బాలయ్య( Balayya ) వరుసగా 4 హిట్లను సొంతం చేసుకోవడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.
స్టార్ హీరో బాలయ్య రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.స్టార్ హీరో బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.