గేమ్ ఛేంజర్ రెండు రోజుల కలెక్షన్ల లెక్కలివే.. రెండో రోజు ఎంత వచ్చాయంటే?

టాలీవుడ్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్(Ram Charan, Shankar) కాంబినేషన్లో తాజాగా తెరకెక్కిన చిత్రం గేమ్ చేంజర్.తాజాగా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.

 Ram Charan Latest Movie Game Changer Box Office Day 2 Collections, Ram Charan, G-TeluguStop.com

ఈనెల 10వ తేదీన విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.ఈ సినిమా విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 186 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన విషయం తెలిసిందే.

తొలి రోజు అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టిన గేమ్ ఛేంజర్ రెండో రోజు కాస్త తగ్గనట్లు తెలుస్తోంది.మొదటి రోజు రూ.51 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన రామ్ చరణ్ మూవీ, రెండవ రోజు కేవలం రూ.21.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

-Movie

దీంతో రెండు రోజుల్లో కలిపి రూ.72.5 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద గేమ్ ఛేంజర్ దూసుకెళ్తోంది.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్( Kollywood star director Shankar ) దర్శకత్వం వహించిన తొలి తెలుగు చిత్రం గేమ్ ఛేంజర్ కావడంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక కలెక్షన్స్‌ సాధిస్తోంది.రెండో రోజు రెండు రాష్ట్రాల్లో రూ.12.7 కోట్లు, హిందీలో రూ.7 కోట్లు, తమిళం రూ.1.7 కోట్లు, కన్నడలో రూ.10 లక్షలు వసూలు చేసింది.తొలి రోజు తెలుగులో థియేటర్లలో మొత్తం 31.19 శాతం ఆక్యుపెన్సీతో నడిచాయి.

-Movie

ఉదయం షోలకు 20.66 శాతం ఆక్యుపెన్సీతో నడవగా.సాయంత్రం షోలలో 36.48 శాతానికి పెరిగింది.సంక్రాంతి పండుగ కావడంతో ఈ మూవీ కలెక్షన్స్‌ మరింత పెరిగే అవకాశం ఉంది.

శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ ఛేంజర్ చిత్రంలో అప్పన్న, రామ్‌ నందన్‌ పాత్రలతో రామ్‌ చరణ్‌ అద్భుతంగా నటించారు.ముఖ్యంగా సెకండాఫ్‌లో అప్పన్న పాత్రలో అదరగొట్టారు.ఎవరైనా సరే చరణ్‌ నటనను మెచ్చుకుని తీరాల్సిందే అనేలా చక్కగా నటించారు.ఇకపోతే సంక్రాంతి పండుగ కావడంతో ప్రస్తుతం మూడు నాలుగు రోజులు సెలవులు ఉన్నాయి.

దీంతో ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు మూవీ మేకర్స్ భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube