టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నిధి అగర్వాల్( Nidhi Agarwal ) ఒకరు.అయితే ఇటీవల కాలంలో ఈమె ఏ ఒక్క సినిమాకు కమిట్ అవ్వకుండా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
ఇక ఈమె వెండితెరపై కనిపించి కూడా చాలా కాలం అవుతుంది.ఈ క్రమంలోనే నిధి అగర్వాల్ సినిమా ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణం ఏంటంటే అభిమానులు భావిస్తున్నారు.
అయితే ఈమె ఇండస్ట్రీకి దూరంగా ఉండడానికి కారణం సినీ నటుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తెలుస్తోంది.
ఈమె ఏ ఒక్క సినిమాకు కమిట్ అవ్వకపోవడానికి కారణం పవన్ కళ్యాణ్ అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా నిధి అగర్వాల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా నిధి అగర్వాల్ మాట్లాడుతూ.నేను లాక్ డౌన్ ముందే హరిహర వీరమల్లు( Harihara Veeramallu ) సినిమాకు సైన్ చేశాను.
పవన్ కళ్యాణ్ సర్ పాలిటిక్స్ తో బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన షూటింగ్ కి డేట్స్ ఇచ్చినప్పుడు నేను కూడా అందుబాటులో ఉండాల్సి ఉంటుంది.అందుకే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యేవరకు ఏ ఒక్క సినిమాకి కమిట్ అవ్వలేకపోతున్నానని తెలిపారు.
సినిమా ఆల్మోస్ట్ 4 ఇయర్స్ పట్టింది.ఈ గ్యాప్ లో చాలా సినిమాలు వచ్చాయి కానీ ఆ కాంట్రాక్టు వల్లే వేరే ఏ సినిమా ఒప్పుకోలేదు.ఈ క్రమంలోనే ప్రభాస్( Prabhas ) హీరోగా నటిస్తున్న రాజా సాబ్( Raja Saab ) సినిమాలో కూడా అవకాశం వచ్చింది కానీ ఈ అవకాశాన్ని వదులుకోకూడదని భావించి ఈ విషయం గురించి తాను హరిహర వీరమల్లు మూవీ టీమ్ తో మాట్లాడి, రిక్వెస్ట్ చేసి, షూటింగ్స్ కి క్లాష్ రానివ్వను అని చెప్పి రాజాసాబ్ సినిమాకు ఓకే చెప్పాను.అయితే కొన్నిసార్లు రెండు సినిమాల షూటింగ్స్ ఒకే రోజు పడటంతో రోజుకు రెండు షిఫ్ట్ లు కూడా పనిచేశాను అంటూ ఈ సందర్భంగా నిధి అగర్వాల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.