నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది... అల్లు అర్జున్ పోస్టు వైరల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు.నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో( Pushpa ) పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు.

 Allu Arjun Special Post On Ala Vaikuntapuramlo Movie Details, , Allu Arjun, Push-TeluguStop.com

ఇక ఇటీవల పుష్ప సీక్వెల్ చిత్రం అయిన పుష్ప 2( Pushpa 2 ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.ఈ సినిమా ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది.

ఇక ఇది మాత్రమే కాకుండా అల్లు అర్జున్ కెరియర్ లో ఎన్నో చెప్పుకోదగ్గ సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి అలాంటి వాటిలో అలా వైకుంఠపురం ఒకటి.

Telugu Allu Arjun, Alluarjun, Icon Allu Arjun, Pooja Hegde, Pushpa, Pushpa Rule,

త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ) అల్లు  అర్జున్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూడో సినిమాగా అలా వైకుంఠపురంలో( Ala Vaikuntapuramloo ) 2020 సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విడుదల అయింది.ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.అల్లు అర్జున్ పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సరిగ్గా ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అల్లు అర్జున్ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

Telugu Allu Arjun, Alluarjun, Icon Allu Arjun, Pooja Hegde, Pushpa, Pushpa Rule,

ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.అలా వైకుంఠపురంలో సినిమా తన హృదయంలో ఎప్పటికీ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటుందని తెలిపారు.ఇలా ఘన విజయాన్ని అందించిన త్రివిక్రమ్, చినబాబు, అల్లు అరవింద్, తమన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజయడమే కాకుండా ఈ సినిమా షూటింగ్ సమయంలో తీసుకున్న కొన్ని ఫోటోలను కూడా ఈయన అభిమానులతో షేర్ చేసుకున్నారు.దీంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube