విక్టరీ వెంకటేష్ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా జనవరి 14వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో వెంకటేష్ (Venkatesh ) స్వయంగా ఓ పాట పాడిన విషయం మనకు తెలిసిందే.బ్లాక్ బస్టర్ పొంగల్ అంటూ సాగిపోయే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
ఇక ఈ పాట గురించి హీరో వెంకటేష్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
నిజానికి ఈ సినిమాలోని ఈ పాటని మ్యూజిక్ డైరెక్టర్ అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కూడా నాతో పాడించాలని ఆలోచన చేయలేదట.అయితే ఒక రోజు ఈ పాట ఒకసారి వినమని అనిల్ రావిపూడి నాకు పంపించారు.అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఈ పాట వింటూ నాకు తెలియకుండా నేనే డాన్స్ చేస్తూ ఉండిపోయాను.
ఈ పాటలో ఏదో తెలియని ఎనర్జీ ఉందని వెంకటేష్ తెలిపారు.
ఇక ఈ పాట విన్న తర్వాత నేనే పాడాలని అనుకున్నాను ఇదే విషయం అనిల్ రావిపూడికి కూడా చెప్పగా ఆ రోజు నా గొంతు బాగానే ఉంది.ఇంగ్లీష్ వర్డ్స్ ఉండటంతో నాకు ఇంకా ఈజీ అయ్యింది.అలా ఈ పాటను తాను పాడానని ఈ పాట మంచి హిట్ అయిందని వెంకటేష్ తెలియజేశారు.
ఇక ఈ సినిమాలో గోదారి గట్టు సాంగ్ కూడా చాలా సంవత్సరాల తర్వాత రమణ గోకులం పాడిన విషయం మనకు తెలిసిందే.ఈ పాట కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవ్వడమే కాకుండా ఎంతో మంది ఈ పాటకు రీల్స్ చేస్తూ మరింత హిట్ చేశారని వెంకటేష్ తెలియజేశారు.
ఇక ఈ సినిమాలో వెంకటేష్ భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary)కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు.మరి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఎలాంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది.