1.లోకేష్ యాత్రలో తారకరత్నకు అస్వస్థత
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్రలో అపశృతి చోటుచేసుకుంది.యాత్రలో పాల్గొన్న నటుడు నందమూరి తారకరత్న స్పృహ తప్పి పడిపోవడంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
2.తారకరత్న ఆరోగ్య పరిస్థితి పై చంద్రబాబు ఆరా
టిడిపి నేత లోకేష్ పాదయాత్రలో అస్వస్థతకు గురైన సినీ నటుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి పై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
3.సినీ నటి జమున మృతి
సినీనటి మాజీ ఎంపీ జమున మృతి చెందారు.
4.పరీక్ష పే పై బండి సంజయ్ కామెంట్స్
విద్యార్థులు ఒత్తిడిని తగ్గించి ఆత్మవిశ్వాసం నింపేందుకే పరీక్షా పే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
5.షర్మిల పాదయాత్రకు అనుమతి
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్రకు పోలీసులు నిబంధనలతో కూడిన అనుమతులు ఇచ్చారు.
6.ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు
తెలంగాణ గవర్నర్ తమిళ సై ను అవమానపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు అందింది.సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకులు శ్రీవాణి ఈ ఫిర్యాదు చేశారు.
7.లోకేష్ కోసం ఉత్తరాంధ్ర నదీ జలాలు
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ఈరోజు కుప్పం నుంచి ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లా టిడిపి నేత అప్పలనాయుడు ఉత్తరాంధ్ర నది జలాలను తీసుకొచ్చి లోకేష్ కు సంఘీభావం తెలిపారు.
8.జమున మృతి పై ఏపీ గవర్నర్ దిగ్భ్రాంతి
సినీనటి మాజీ ఎంపీ జమున నూతన ఏపీ గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్ తన సంతాపం తెలియజేశారు.
9.పాలేరు నవోదయ విద్యాలయంలో ఫుడ్ పాయిజన్
ఖమ్మం జిల్లా పాలేరులో నవోదయ విద్యాలయంలో విద్యార్థులు అస్వస్థత కు గురయ్యారు.ఫుడ్ పాయిజన్ కావడమే దీనికి కారణం.
10.తెలంగాణలో టీచర్ల పదోన్నతులు.బదిలీలు
నేటి నుంచి తెలంగాణలో టీచర్ల పదోన్నతులు బదిలీలు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు నిర్వహించనున్నారు.రేపటి నుంచి ఈనెల 31 వరకు బదిలీల కోసం ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
11.తిరుమలలో రథసప్తమి వేడుకలు
రేపు తిరుమలలో రథసప్తమి వేడుకలు జరగనున్నాయి.ఎస్ ఎస్ డి టోకెన్లు, వీఐపీ బ్రేక్ , ఆర్జిత సేవలను రద్దు చేసింది.అలాగే నేడు, రేపు అడ్వాన్స్ డ్ వసతి గదులు కేటాయింపును టీటీడీ రద్దు చేసింది.
12.టీటీడీ మొబైల్ యాప్ విడుదల
ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం మొబైల్ యాప్ ను టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి విడుదల చేయనున్నారు .మొబైల్ యాప్ ద్వారా టిటిడి కి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని భక్తులు తెలుసుకోవచ్చని టీటీడీ తెలిపింది.
13.తెనాలిలో నాదెండ్ల మనోహర్ పర్యటన
నేటి నుంచి రెండు రోజులపాటు గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన పీ ఏ సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటించనున్నారు.
14.రాష్ట్రస్థాయి కోకో పోటీలు
విజయనగరం రాజీవ్ మైదానంలో నేటి నుంచి రాష్ట్ర స్థాయి కోకో పోటీలు జరగనున్నాయి.
15.కెసిఆర్ నాందేడ్ పర్యటన
టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 5న మహారాష్ట్రలోని నాదెండ్ లో బీఆర్ ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించనున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లనున్నారు.
16.బీఆర్ఎస్ లో చేరనున్న ఒరిస్సా మాజీ సీఎం
ఒరిస్సా మాజీ సీఎం గిరిధర్ ఘమాంగ్ కెసిఆర్ సమక్షంలో నేడు బీఆర్ఎస్ లో చేరనున్నారు.
17.కెసిఆర్ తో చత్రపతి శివాజీ వారసుడి భేటీ
మరాఠా వీరుడు చత్రపతి శివాజీ 13వ వారసుడు సాహు మహారాజ్ మనవడు కొల్లాపూర్ సంస్థాన వారసుడు , స్వరాజ్ ఉద్యమకారుడు మాజీ ఎంపీ ఛత్రపతి శంభాజీ రాజే కెసిఆర్ తో ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు.
18.ఎండి హోమియో కోర్సుల కు ఆన్లైన్ దరఖాస్తులు
కాళోజి నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కి అనుబంధంగా ఉన్న ప్రైవేట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజీలలో 2022 – 23 విద్యాసంవత్సరానికి ఎండి హోమియో కోర్సుల్లో ప్రవేశానికి AIAPGET 2022 అర్హత పొందిన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
19.లోకేష్ పాదయాత్ర పై కొడాలి నాని కామెంట్స్
టిడిపి నేత నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర పై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన కామెంట్స్ చేశారు .కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ అసమర్ధుడని ఆయన పాదయాత్ర చేస్తే టిడిపి అధికారంలోకి వచ్చే సీన్ ఉందా అంటూ నాని ప్రశ్నించారు.
20.మార్చి ఒకటి నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ : జగన్
వైద్య ఆరోగ్యశాఖ పై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మార్చి ఒకటో తేదీ నుంచి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు కాబోతున్నట్లు జగన్ ప్రకటించారు.