బకింగ్‌హామ్‌షైర్‌లోని ఎయిల్స్‌బరీకి(Aylesbury, Buckinghamshire) చెందిన 32 ఏళ్ల హ్యారీ సీగర్ జీవితంలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది.హ్యారీ బిర్మింగ్‌హామ్‌లోని ఒక కార్‌షోకు వెళ్లినప్పుడు ఒక మార్స్ చాక్లెట్ బార్‌ను ఇష్టపడ్డారు.
ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లోని ఒక సర్వీస్ స్టేషన్‌లో ఆయన ఆ చాక్లెట్ బార్‌ను కొనుగోలు చేశారు.మార్స్ చాక్లెట్ బార్స్‌పై(Mars chocolate bar) ఒక అందమైన డిజైన్ లాగా గీతలు ఉంటాయి.
కానీ హ్యారీ కొన్న ఈ చాక్లెట్ బార్( chocolate bar) అలాంటి గీతలు ఏమీ లేవుకుండా ప్లేన్ గా ఉండటం ఆయనను ఆశ్చర్యపరిచింది.ఈ విషయం కంపెనీకి తెలియజేయగా, ఆయనకు నష్టపరిహారంగా £2 (రూ.215) విలువైన వౌచర్‌ను అందించారు.
ఆ చాక్లెట్ బార్ ఎలా ఉందో చూడాలని, హ్యారీ సీగర్ ఆ ఫోటోను ఫేస్‌బుక్ గ్రూప్‌లో పోస్ట్ చేసి, మార్స్ వ్రిగ్లీ యూకే (Mars Wrigley UK)సంస్థను సంప్రదించారు.ఈ ప్లయిన్ చాక్లెట్ బార్ కొత్త డిజైన్‌లో భాగమా లేక తయారీలో జరిగిన తప్పు అనేది ఆయనకు తెలుసుకోవాలని అనుకున్నారు.మార్స్ వ్రిగ్లీ సంస్థ ఈ సంఘటనకు క్షమాపణ చెప్పింది.
ఇది ఉద్దేశపూర్వకంగా జరగలేదని నిర్ధారించింది.అంతేకాకుండా సీగర్‌కు రెండు మార్స్ బార్లు కొనుగోలు చేయడానికి సరిపోయే £2 విలువైన వౌచర్‌ను పంపారు.
వారి సమాధానంలో, “మీ అనుభవం గురించి తెలిసి మేం బాగా చింతిస్తున్నాం.మీ అభిప్రాయాన్ని మా క్వాలిటీ టీమ్‌తో పంచుకుంటాం.దయచేసి భవిష్యత్తులో కొనుగోలు చేయడానికి ఈ £2 వౌచర్‌ను అంగీకరించండి.” అని రాశారు.
అయితే, సీగర్‌కు ఆ చాక్లెట్ బార్‌లో గీతలు లేకపోవడానికి కారణం తెలుసుకోవడం ముఖ్యంగా ఉంది.బీబీసీతో(BBC) మాట్లాడుతూ, కంపెనీ ఆయన ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి నిరాకరించిందని అన్నారు.“దీనికి కారణం ఏమిటో తెలుసుకోవడానికి నేను వారిని సంప్రదించాను.వారు వివరించలేదు” అని ఆయన చెప్పారు.అయినప్పటికీ, సీగర్ ఈ సంఘటనను తేలికగా తీసుకున్నారు.“£2 అంటే చాలా బాగుంది.దీనితో రెండు మార్స్ బార్లు ఫ్రీగా వస్తాయి! వారు కొంచెం ఎక్కువ పంపించి ఉండవచ్చు, కానీ నేను బాధపడటం లేదు.ఒక చాక్లెట్ బార్ కోసం ఇది చాలా సాహసం” అని ఆయన జోడించారు.