సాధారణంగా ఉదయం లేచిన సమయం నుంచి రాత్రి పడుకునే వరకు ఆడవారికి( Women ) ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది.ఈ క్రమంలో వారి పనులు సులువు చేసుకునే కొరకు వివిధ రకాల ప్రయత్నాలు చేయడంతో పాటు కొంత మంది తెలివి ఉపయోగించి వారి పనులను చాలా సులువుగా చేసుకుంటూ ఉంటారు.
ఇక మరికొందరు అయితే, ఎవరు ఊహించని విధంగా ఆలోచించి కొన్ని పనులు చేసి అందరినీ బాగా ఆకట్టుకుంటూ ఉంటారు.సైకిల్ పెడల్ సహాయంతో బట్టలు ఉతకడం, చపాతీలు చేయడానికి చపాతి పిండి ఉండలను అన్ని ఒకేచోట ఉంచి ఒకటే సారి చపాతీలు చేయడం.
ఇలా పలు రకాలకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.అచ్చం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.
వైరల్ అవుతున్న వీడియో( Viral Video ) ఆధారంగా.వంట చేసే క్రమంలో సాధారణంగా ఉల్లిపాయలు తరగడం పచ్చిమిర్చి( Green Chillies ) కట్ చేయడం ఒక పెద్ద టాస్క్ అవుతుంది.ఉల్లిపాయలు తరిగే సమయంలో కళ్ళలోకి కన్నీళ్లు రావడం, మిరపకాయ కట్ చేసే క్రమంలో చేతికి మంట తగలడం సర్వసాధారణం.చేతికి, కళ్ళకి ఎటువంటి ఇబ్బంది తగలకుండా ఉండేందుకు చాలామంది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
అయితే వైరల్ అవుతున్న వీడియోలో ఒక మహిళ మిరపకాయలను కట్ చేయాలంటే మారడంతో ఆ సమస్యకు ఎంతో తెలివిగా చెక్ పెట్టేసింది.
మిరపకాయలు కట్ చేస్తున్న క్రమంలో ఐస్ క్రీమ్ స్టిక్ ను( Ice Cream Stick ) తీసుకొని తన వేలికి తగిలించి రబ్బర్ బ్యాండ్ వేసుకుంది.అనంతరం ఆ మిరపకాయలను ఫాస్ట్ ఫాస్ట్ గా చక చకా కట్ చేయడం మొదలు పెట్టేసింది.ఇలా ఐస్ క్రీమ్ స్టిక్ సహాయంతో మిరపకాయలు కట్ చేయడంతో చేతికి ఎటువంటి మంట తగలకుండా, గాయం కాకుండా ఉంటుంది.
ఇక ఈ మహిళ తెలివి చూసినవారు అందరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.ఇక వీడియోను చూసిన కొంతమందిని నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తూ.అక్క నువ్వు గ్రేట్ అని కామెంట్ చేస్తూ ఉంటే మరికొందరు ఈ ఐడియా సూపర్ అని కామెంట్ చేస్తున్నారు.