అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థకు అధిపతిగా కశ్యప్ పటేల్ .. ట్రంప్ కీలక ప్రకటన

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రిపబ్లికన్ నేత, డొనాల్డ్ ట్రంప్(Republican leader, Donald Trump) ప్రమాణ స్వీకారం నాటికి తన కేబినెట్‌ను , ఇతర పరిపాలనా యంత్రాంగాన్ని సిద్ధం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు.ఇప్పటికే కీలక పదవులకు నియామకాలను పూర్తి చేసిన ట్రంప్ మరింత దూకుడుగా వెళ్తున్నారు.

 Donald Trump Picks Indian-american Kash Patel As New Fbi Director, Indian-americ-TeluguStop.com

ట్రంప్ (Trump)టీమ్‌లో పలువురు భారత సంతతి ప్రముఖులు కూడా ఉన్నారు.ఇప్పటికే జే భట్టాచార్య, వివేక్ రామస్వామిలను కీలక పదవుల్లో నియమించారు.

తాజాగా మరో భారతీయ అమెరికన్‌కు అత్యున్నత పదవి దక్కింది.అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్ధ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా కశ్యప్ పటేల్ (కాష్ పటేల్)ను నియమించనున్నట్లుగా ప్రకటించారు .ఆయన సారథ్యంలో ఎఫ్‌బీఐకి పూర్వ వైభవం వస్తుందని ట్రంప్ ఆకాంక్షించారు

ఎవరీ కశ్యప్ పటేల్ :(Every Kashyap Patel)

Telugu Donald Trump, Kashyap Patel, Fbi, Indian American, Kash Patel-Telugu NRI

గుజరాత్ మూలాలున్న తల్లిదండ్రులకు న్యూయార్క్‌లో 1980లో జన్మించారు కాష్ పటేల్.తొలుత వీరి కుటుంబం ఆఫ్రికాలోని ఉగాండాలో ఉండేది.అయితే అప్పటి ఆ దేశ అధినేత ఈదీ ఆమిన్ వేధింపుల కారణంగా కాష్ తల్లిదండ్రులు అమెరికాకు వలస వచ్చారు.యూనివర్సిటీ ఆఫ్ రిచ్‌మాండ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కశ్యప్.

అనంతరం యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో లా పట్ట పొందరు.అనంతరం మియామీ కోర్టులలో పలు హోదాలలో పనిచేశారు.

Telugu Donald Trump, Kashyap Patel, Fbi, Indian American, Kash Patel-Telugu NRI

అమెరికా అధ్యక్షుడికి డిప్యూటీ అసిస్టెంట్‌గా, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ (National Security Council)(ఎన్ఎస్‌సీ)లో కౌంటర్ టెర్రరిజం సీనియర్ డైరెక్టర్‌గా సేవలందించారు.అతని డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొఫైల్ ప్రకారం.నేషనల్ ఇంటెలిజెన్స్ యాక్టింగ్ డైరెక్టర్‌కు ప్రిన్సిపల్‌ డిప్యూటీగా కూడా పనిచేశారు.ఈ హోదాలో ఆయన 17 ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ ఏజెన్సీల కార్యకలాపాలను పర్యవేక్షించడంతో పాటు అధ్యక్షుడి రోజువారీ బ్రీఫింగ్‌ను అందించేవారు.ఇక రిపబ్లికన్ పార్టీకి ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్‌కు వీర విధేయుడిగా కాష్ పటేల్‌కు అమెరికా రాజకీయాల్లో పేరుంది.2020 అధ్యక్ష ఎన్నికల తర్వాత యూఎస్ కేపిటల్ వద్ద చోటు చేసుకున్న ఘటన కేసులో కశ్యప్ పటేల్ పేరు కూడా వినిపించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube