హీరో విజయ్ సేతుపతి(Hero Vijay Sethupathi) గురించి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం ఈయన వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.
ఈ మధ్యకాలంలో ఆయన నటించిన సినిమాలు చాలా వరకు సక్సెస్ గా నిలుస్తున్నాయి.ఇకపోతే త్వరగా విజయ్ సేతుపతి (Vijay Sethupathi)నటించిన మహారాజ సినిమా చైనా దేశంలో విడుదల అవ్వడమే గొప్ప అనుకుంటే ఏకంగా 100, 200 కాదండోయ్ 40 వేలకు పైగా స్క్రీన్ లలో విడుదల అయ్యి మొదటి రోజే 16 కోట్లకు పైగా వసూలు చేసి ప్రతి ఒక్కరి చేత శభాష్ అనిపించుకుంది.
అన్ని స్క్రీన్ లలో విడుదల అవ్వడం ఒక ఎత్తు అయితే మొదటి రోజే అన్ని కోట్లు వసూలు చేయడం అన్నది మరొక ఎత్తు అని చెప్పాలి.నితిలన్ స్వామినాథన్(Nithilan Swaminathan) దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లింగ్ రివెంజ్ డ్రామాకు అక్కడి ఆడియన్స్ ఫిదా అయిపోయారు.

చైనాలో సుమారుగా 85 వేల స్క్రీన్ లు ఉన్నాయి.వాటిలో సగానికి పైగా ఒక తమిళ చిత్రం ప్రదర్శించడం గొప్ప ఆయితే ఏకంగా వాళ్లకు బ్రహ్మాండంగా నచ్చేయడం అసలు విషయం.లాంగ్ రన్ ఖాయమని అక్కడి బిజినెస్ వర్గాల టాక్.చైనీస్ సినిమాలను రివ్యూ చేసే డౌబన్ అనే వెబ్ సైట్ 8.7 / 10 రేటింగ్ ఇచ్చి గత కొన్నేళ్లలో హయ్యెస్ట్ రేటింగ్ దక్కించుకున్న ఇండియన్ మూవీగా పొగడ్తల వర్షం కురిపించింది.ఈస్ట్రన్ లడాఖ్ కు సంబంధించిన సరిహద్దు వివాదం రెండు దేశాల మధ్య అగాధం సృష్టించాక కొంత కాలం పాటు చైనాలో భారతీయ సినిమాలు రిలీజ్ కావడం లేదు.
నాలుగేళ్లుగా నలుగుతున్న బోర్డర్ కాంట్రావర్సికి మన ప్రధాని నరేంద్రమోడీ, చైనా పీఎం ఎలెవన్ జింగ్ పాంగ్ (Prime Minister Narendra Modi and Chinese PM Xi Jinping)రష్యా వేదికగా సామరస్య ఒప్పందానికి వచ్చి అగ్రిమెంట్ రాసుకున్నారు.

దాని తర్వాత వచ్చిన మొదటి ఇండియన్ మూవీ మహారాజ(Maharaja).హాలీవుడ్ నుంచి వచ్చిన గ్లాడియేటర్ 2(Gladiator 2) నుంచి విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ మహారాజ ఇంత స్ట్రాంగ్ గా నిలవడం అన్నది గొప్ప విశేషం.చెత్తబుట్ట పోయిందని పోలీసులకు కంప్లయింట్ ఇచ్చే ఒక మాములు మనిషి తాను దత్తత తీసుకన్న కూతురి మీద అఘాయిత్యం జరిగితే దానికి ప్రతీకారం తీర్చుకునే తీరు తెరమీద అద్భుతంగా పండింది.
అందుకే ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల వసూళ్లు రాబట్టి ఔరా అనిపించింది.ఇప్పుడు చైనాలోనూ అదే దూకుడు చూపించడం గమనిస్తే యునివర్సల్ గా ఇదెంత గొప్ప సబ్జెక్టో అర్థమవుతుంది.